Ind Vs SA 1st T20: Rohit Serious On Pant Over Not Confident About Markram LBW Appeal - Sakshi
Sakshi News home page

IND Vs SA 1st T20: రివ్యూ విషయంలో పంత్‌ తడబాటు.. రోహిత్‌ ఆగ్రహం

Published Wed, Sep 28 2022 8:12 PM | Last Updated on Wed, Sep 28 2022 8:26 PM

Rohit Fires-On Rishabh Pant Was Not Confident About Markram LBW Appael  - Sakshi

సౌతాఫ్రికాతో తొలి టి20లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం లభించింది. ఆరంభంలోనే దీపక్‌ చహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లు బౌలింగ్‌లో చెలరేగడంతో సౌతాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక విషయానికి వస్తే టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు.

రివ్యూ విషయంలో పంత్‌ తడబాటుకు గురవ్వడం రోహిత్‌కు కోపం తెప్పించింది. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో మార్ర్కమ్‌ 8వ ఓవర్‌ చివరి బంతిని ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్లను తాకింది. దీంతో హర్షల్‌ పటేల్‌ అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ ఔటివ్వలేదు. దీంతో రోహిత్‌ శర్మ హర్షల్‌ పటేల్‌తో మాట్లాడి పంత్‌ను అడిగాడు. ఎల్బీ విషయంలో కీపర్‌కు ఉన్న స్పష్టత ఎవరికి ఉండదని అందరికి తెలిసిందే.

అయితే పంత్‌ మాత్రం అంత కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో రోహిత్‌.. ''అరె ఏంటిది?'' అన్నట్లు అసహనం వ్యక్తం చేశాడు. అయితే స్లిప్‌లో ఉన్న కోహ్లి మాత్రం రివ్యూకు వెళ్లు అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో రోహిత్‌ రివ్యూకు వెళ్లాడు. ఇక రిప్లైలో బంతి క్లియర్‌గా మిడిల్‌ స్టంప్‌ను ఎగురగొడుతున్నట్లు చూపించడంతో మార్ర్కమ్‌ ఔట్‌ అని అంపైర్‌ ప్రకటించాడు. కాగా బ్రేక్‌ సమయంలో రోహిత్‌.. పంత్‌ను బంతిపై కాస్త దృష్టిపెట్టు అన్నట్లుగా పేర్కొన్నాడు. ఇక కోహ్లి మాత్రం తన అంచనా నిజమైందని తెగ సంతోషపడిపోయాడు.

చదవండి: టీమిండియా గబ్బర్‌ను గుర్తుచేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement