మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో పీవీ సింధు ఓటమి | Sakshi
Sakshi News home page

Malaysia Masters: మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో పీవీ సింధు ఓటమి

Published Sun, May 26 2024 4:49 PM

PV Sindhu suffers defeat in Malaysia Masters final against China's Wang Zhiyi

టైటిల్ విజ‌యం కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న‌ భార‌త స్టార్ ష‌ట్ల‌ర్‌, తెలుగు తేజం పీవీ సింధుకు మ‌రోసారి నిరాశే ఎదురైంది. మ‌లేషియా మాస్టర్స్ సూప‌ర్ 500 టోర్నీ ఫైన‌ల్లో సింధూ ఓట‌మి చ‌విచూసింది. 

ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ పోరులో చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి రౌండ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు రౌండ్ల‌లో ప్ర‌త్య‌ర్ధి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. 

రెండో రౌండ్ ముగిసే స‌రికి ఇరువ‌రు చెరో విజ‌యంతో సమంగా నిల‌వ‌గా.. ఫ‌లితాన్ని తెల్చే మూడో రౌండ్‌లో ప్ర‌త్య‌ర్ధి వాంగ్ జీయీ చెల‌రేగిపోయింది.సింధూకు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా టైటిల్‌ను ఎగ‌రేసుకుపోయింది. 

దీంతో మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సింధుకు గట్టి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement