పాపం రుతురాజ్‌.. క్రికెట్‌ చరిత్రలో ఇలా ఎవరూ రనౌటై ఉండరు..! | MPL 2024: Ruturaj Gaikwad Gets Run Out In The Most Saddest Way, Gets Out Despite Getting Into The Crease | Sakshi
Sakshi News home page

పాపం రుతురాజ్‌.. క్రికెట్‌ చరిత్రలో ఇలా ఎవరూ రనౌటై ఉండరు..!

Published Sat, Jun 8 2024 4:56 PM | Last Updated on Sat, Jun 8 2024 5:05 PM

MPL 2024: Ruturaj Gaikwad Gets Run Out In The Most Saddest Way, Gets Out Despite Getting Into The Crease

టీమిండియా యువ ఓపెనర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారధి రుతురాజ్ గైక్వాడ్‌ వినూత్న రీతిలో రనౌటై వార్తల్లో నిలిచాడు. మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో పుణేరీ బప్పా టీమ్‌కు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్‌ 7) రత్నగిరి జెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా రనౌటయ్యాడు. పుణేరీ బప్పా ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో రుతు రెండు పరుగులు రాబట్టే ప్రయత్నంలో బాధాకరమైన రీతిలో రనౌటయ్యాడు. 

రుతు రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీజ్‌లోకి చేరకముందే బ్యాట్‌కు అతని చేతికి కనెక్షన్‌ కట్టైంది. రుతురాజ్‌ బ్యాట్‌ క్రీజ్‌లోకి చేరినా అది అతని చేతిలో నుంచి జారిపోయింది. ఈ లోపు వికెట్‌కీపర్‌ వికెట్లను గిరాటు వేశాడు. రీప్లేలో రుతురాజ్‌ బ్యాట్‌ క్రీజ్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా బ్యాట్‌ అతని చేతిలో లేకపోవడంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఈ రనౌట్‌ డ్రామాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ సారథ్యం వహిస్తున్న పుణేరీ బప్పా జట్టు ప్రత్యర్థి రత్నగిరి జెట్స్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పుణేరీ టీమ్‌ 19.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. రత్నగిరి బౌలర్లలో సత్యజిత్‌ (4-0-24-4) పుణేరీ టీమ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. పుణేరీ ఇన్నింగ్స్‌లో పవన్‌ షా (32), రుతురాజ్‌ (29), యశ్‌ సాగర్‌ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రత్నగిరి టీమ్‌.. 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ధీరజ్‌ (25), అజిమ్‌ ఖాజీ (31), నిఖిల్‌ నాయక్‌ (27 నాటౌట్‌), సత్యజిత్‌ (17 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేసి రత్నగిరి జెట్స్‌ను గెలిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement