RR VS LSG Updates: బోణీ కొట్టిన రాజ‌స్తాన్‌.. ల‌క్నోపై ఘ‌న విజ‌యం | IPL 2024 RR Vs LSG Live Score Updates, Highlights And Viral Videos - Sakshi
Sakshi News home page

IPL 2024 RR VS LSG Updates: బోణీ కొట్టిన రాజ‌స్తాన్‌.. ల‌క్నోపై ఘ‌న విజ‌యం

Published Sun, Mar 24 2024 3:06 PM | Last Updated on Sun, Mar 24 2024 7:42 PM

IPL 2024 RR VS LSG Jaipur: Updates And Highlights - Sakshi

IPL 2024 RR VS LSG Jaipur Live Updates And Highlights

బోణీ కొట్టిన రాజ‌స్తాన్‌.. ల‌క్నోపై ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ బోణీ కొట్టింది. జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఘన విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసింది.

లక్నో బ‍్యాటర్లలో పూరన్‌ (64) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(58) పరుగులతో పర్వాలేదన్పించాడు. రాజస్తాన్‌ బౌలర్లలో బౌల్ట్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్‌, అశ్విన్‌, చాహల్‌, సందీప్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు.

కేఎల్ రాహుల్ ఫిప్టీ.. 14 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోర్‌: 129/4
14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి  ల‌క్నో 4 వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్‌(53), పూర‌న్‌(35) ప‌రుగుల‌తో ఉన్నారు. ల‌క్నో విజ‌యానికి 36 బంతుల్లో 65 ప‌రుగులు కావాలి.

మూడో వికెట్ డౌన్‌.. హుడా ఔట్‌
దీప‌క్ హుడా రూపంలో ల‌క్నో మూడో వికెట్ కోల్పోయింది. 26 ప‌రుగులు చేసిన హుడా.. చాహ‌ల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి నికోల‌స్ పూర‌న్ వ‌చ్చాడు.

6 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోర్‌ 47/2
6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 47 ప‌రుగులు చేసింది. క్రీజులో దీప‌క్ హుడా(18), కేఎల్ రాహ‌ల్(15) ఉన్నారు. 

రెండో వికెట్‌ డౌన్‌
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పడిక్కల్‌ రూపంలో లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ పడిక్కల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 3 ఓవర్లకు లక్నో స్కోర్‌ 12/2

తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో.. డికాక్‌ ఔట్‌
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన క్వింటన్‌ డికాక్‌.. బౌల్ట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పడిక్కల్‌ వచ్చాడు.

సంజూ శాంసన్‌ విధ్వంసం.. రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ స్కోర్‌
లక్నోతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌.. సంజూ శాంసన్‌ (52 బంతుల్లో 82 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ (11), హెట్‌మైర్‌ (5) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. రియాన్‌ పరాగ్‌ (43), యశస్వి జైస్వాల్‌ (24), ద్రువ్‌ జురెల్‌ (20 నాటౌట్‌) వేగంగా పరుగులు సాధించారు. లక్నో బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 2, మొహిసిన్‌ ఖాన్‌, రవి భిఫ్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

నాలుగో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌
150 పరుగుల వద్ద (16.3 ఓవర్‌) రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. రవి భిష్ణోయ్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి హెట్‌మైర్‌ (5) ఔటయ్యాడు.శాంసన్‌కు (62) జతగా ద్రువ్‌ జురెల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.  

మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌.. దూకుడుగా ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ ఔట్‌
14.5వ ఓవర్‌లో 142 పరుగుల వద్ద రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ (29 బంతుల్లో 43; ఫోర్‌, 3 సిక్సర్లు) నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. సంజూ శాంసన్‌ (59) క్రీజ్‌లో ఉన్నాడు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్‌
సంజూ శాంసన్‌ తన కెరీర్‌లో 21వ ఐపీఎల్‌ ఫిఫ్టిని పూర్తి చేసుకున్నాడు. సంజూ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 14 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 128/2గా ఉంది. సంజూ (58), రియాన్‌ పరాగ్‌ (32) క్రీజ్‌లో ఉన్నారు.

వరుస సిక్సర్లతో విరుచుకుపడిన సంజూ శాంసన్‌
9.0 ఓవర్‌: యశ్‌ ఠాకూర్‌ వేసిన 9వ ఓవర్‌లో సంజూ శాంసన్‌ శివాలెత్తిపోయాడు. ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అంకుమందు ఇదే ఓవర్‌లో రియన్‌ పరాగ్‌ కూడా ఓ సిక్సర్‌ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. 9 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 84/2. సంజూ (33), పరాగ్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు.

8 ఓవర్ల తర్వాత 63/2
8.0 ఓవర్‌: స్ట్రాటజిక్‌ టైమ్‌ ఔట్‌ సమయానికి రాజస్థాన్‌ స్కోర్‌ 63/2గా ఉంది. సంజూ శాంసన్‌ (21), రియాన్‌ పరాగ్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌.. డేంజర్‌ యశస్వి ఔట్‌
5.6 ఓవర్‌: మొహిసిన్‌ ఖాన్‌ వేసిన ఐదో ఓవర్‌లో బౌండరీ, సిక్సర్‌ బాది జోష్‌ మీదుండిన యశస్వి జైస్వాల్‌ (12 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌).. అదే ఓవర్‌ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కృనాల్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ పారేసుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 49/2. సంజూ శాంసన్‌ (13), రియాన్‌ పరాగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

అద్బుతమైన క్యాచ్‌ పట్టిన రాహుల్‌.. బట్లర్‌ ఔట్‌
1.6 ఓవర్‌: నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో జోస్‌ బట్లర్‌ (11) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత రాజస్థాన్‌ స్కోర్‌ 13/1. యశస్వి (1), సంజూ శాంసన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌..
జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 24) రాజస్థాన్‌ రాయల్స్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

తుది జట్లు..

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రోన్‌ హెట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్‌), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement