Ind vs Ban: ఇలాంటి పిచ్‌లకు అలవాటు పడాలి: రోహిత్‌ శర్మ Ind vs Ban T20 WC 2024 Warm Up Game: When Where To Watch Live Streaming Details | Sakshi
Sakshi News home page

IND Vs BAN, T20 World Cup 2024 Warm-Up Match: బంగ్లాతో టీమిండియా వార్మప్‌ మ్యాచ్‌.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?

Published Sat, Jun 1 2024 5:18 PM | Last Updated on Sat, Jun 1 2024 6:35 PM

Ind vs Ban T20 WC 2024 Warm Up Game: When Where To Watch Live Streaming Details

టీ20 ప్రపంచకప్‌-2024 ఫీవర్‌ తారస్థాయికి చేరింది. అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీ జూన్‌ 1(యూఎస్‌ కాలమానం ప్రకారం)న మొదలుకానుంది. ఆతిథ్య అమెరికా- కెనడా మధ్య డలాస్‌ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్‌ ఆరంభం కానుంది.

కాగా వరల్డ్‌కప్‌ లీగ్‌ దశలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. జూన్‌ 5న ఐర్లాండ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.

అయితే, అంతకంటే ముందు ఇక్కడ రోహిత్‌ సేన బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ ఇక్కడ ఆడలేదు కాబట్టి ముందుగా మేం పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.

జూన్‌ 5న ఇక్కడ తొలి మ్యాచ్‌ ఆడే సమయానికి ఏదీ కొత్తగా అనిపించకుండా ఉండటం ముఖ్యం. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌కు అలవాటు పడటం కూడా కీలకం. ఒక్కసారి లయ అందుకుంటే అంతా సజావుగా సాగిపోతుంది. కొత్త వేదిక చాలా బాగుంది. మైదానమంతా ఓపెన్‌గా ఉండటంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

న్యూయార్క్‌ వాసులు ఇక్కడ తొలిసారి జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అభిమానుల తరహాలోనే మేం కూడా మ్యాచ్‌ల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. టోర్నీ బాగా జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.

ఇక అసలైన పోరు మొదలుకావడానికి ముందు టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌ కోసం కూడా అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇవీ:

టీమిండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌
సమయం: భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభం
వేదిక: నసావూ కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియం, న్యూయార్క్‌
ప్రత్యక్ష ప్రసారం: టీవీలో స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ఇక డిజిటల్‌ మీడియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుంది.

జట్లు
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్( వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్, యజువేంద్ర చహల్.

బంగ్లాదేశ్‌: లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకర్ అలీ(వికెట్ కీపర్), మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిద్ హసన్, తన్జీమ్ హసన్ సకీబ్, తన్వీర్ ఇస్లాం.

చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్‌, సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు
T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్‌ ఏంటి?.. పూర్తి వివరాలు
T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement