CWC Qualifier 2023: Sri Lanka And Netherlands Qualify For 2023 ODI World Cup - Sakshi
Sakshi News home page

వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్‌.. భారత షెడ్యూల్‌ ఇలా..!

Published Fri, Jul 7 2023 8:18 AM | Last Updated on Fri, Jul 7 2023 10:28 AM

CWC Qualifier 2023: Sri Lanka And Netherlands Qualify To 2023 ODI World Cup - Sakshi

భారత్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే పదో జట్టుగా నెదర్లాండ్స్‌ నిన్ననే (జులై 6) తమ బెర్తును ఖరారు చేసుకుంది. క్వాలిఫయర్స్‌ పోటీల్లో నిన్న స్కాట్లాండ్‌పై విజయం సాధించడం ద్వారా డచ్‌ టీమ్‌ మెగా టోర్నీలో పాల్గొనే సువర్ణావకాశాన్ని దక్కించుకుంది.

దీనికి ముందు ఇదే క్వాలిఫయర్స్‌లో సత్తా చాటడం ద్వారా శ్రీలంక కూడా వరల్డ్‌కప్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుంది. మొత్తంగా క్వాలిఫయర్స్‌ పోటీల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయర్‌-1గా శ్రీలంక, క్వాలిఫయర్‌-2గా నెదర్లాండ్స్‌ నిలిచాయి. క్వాలిఫయర్స్‌ ఫైనల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు ప్రపంచకప్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకున్నాయి. 

ఈ జట్ల చేరిక తర్వాత వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌కు తుది రూపు వచ్చింది. మెగా టోర్నీలో భారత్‌ ఆడబోయే మ్యాచ్‌లపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. 7 మ్యాచ్‌లు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం యధాతథంగా జరుగనుండగా.. నవంబర్‌ 2న ముంబై వేదికగా భారత్‌తో తలపడబోయే ప్రత్యర్ధిగా నెదర్లాండ్స్‌, నవంబర్‌ 11న బెంగళూరు వేదికగా జరుగబోయే మ్యాచ్‌లో భారత ప్రత్యర్ధిగా శ్రీలంక జట్లు నిలువనున్నాయి. 

ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల్లోనూ ఏయే జట్లు తలపడునున్నది కూడా కన్ఫర్మ్‌ అయ్యింది. మొత్తంగా క్వాలిఫయర్‌-1, క్వాలిఫయర్‌-2 జట్లు ఖరారు కావడంతో వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ తుది రూపు సంతరించుకుంది.

భారత్‌‌ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..

  • అక్టోబర్‌ 8: ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా (చెన్నై)
  • అక్టోబర్‌ 11: ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (ఢిల్లీ)
  • అక్టోబర్‌ 15: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ (అహ్మదాబాద్‌)
  • అక్టోబర్‌ 19: ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (పూణే)
  • అక్టోబర్‌ 22: ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ (ధర్మశాల)
  • అక్టోబర్‌ 29: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (లక్నో)
  • నవంబర్‌ 2: ఇండియా వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (ముంబై)
  • నవంబర్‌ 5: ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా (కోల్‌కతా)
  • నవంబర్‌ 11: ఇండియా వర్సెస్‌ శ్రీలంక (బెంగళూరు)

ఉప్పల్‌ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు..

  • అక్టోబర్‌ 6 (శుక్రవారం​): పాకిస్తాన్‌ వర్సెస్‌ శ్రీలంక
  • అక్టోబర్‌ 9 (సోమవారం​): న్యూజిలాండ్‌‌ వర్సెస్‌ శ్రీలంక
  • అక్టోబర్‌ 12 (గురువారం​): పాకిస్తాన్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement