Charith Asalanka Helps Sri Lanka Topple New Zealand 1st T20 - Sakshi
Sakshi News home page

NZ vs SL: పగ తీర్చుకున్న శ్రీలంక.. షాక్‌లో న్యూజిలాండ్‌! సూపర్‌ ఓవర్‌లో

Published Sun, Apr 2 2023 1:28 PM | Last Updated on Sun, Apr 2 2023 2:47 PM

Charith Asalanka helps Sri Lanka topple New Zealand 1st t20 - Sakshi

ఆక్లాండ్‌ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్‌ మధ్య తొలి టీ20  థ్రిల్లర్ సినిమాను తలపించింది. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో అంతిమంగా విజయం శ్రీలంకనే వరించింది.  197 విజయ లక్క్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 196 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.

సూపర్‌ ఓవర్‌ను వేసే బాధ్యత లంక కెప్టెన్‌ స్పిన్నర్‌ తీక్షణకు అప్పజెప్పాడు. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ రెండు వికెట్ల నష్టానికి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక 9 పరుగుల లక్క్ష్యంతో దిగిన శ్రీలంక.. మూడు బంతుల్లోనే ఛేదించింది. లంక బ్యాటర్‌ అసలంక సిక్స్‌, ఫోర్‌తో మ్యాచ్‌ ఫినిస్‌ చేశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అసలంక, పెరీరా సూపర్‌ ఇన్నింగ్స్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్‌ పెరీరా(45 బంతుల్లో 53), అసలంక(41 బంతుల్లో 67) అద్బుత ఇన్నింగ్స్‌ ఆడారు. అనంతరం 197 పరుగుల లక్క్ష్య చేధనలో కివీస్‌ కూడా ధీటుగా బదులిచ్చింది. డారిల్‌ మిచెల్‌(66), ఆఖరిలో సోధి(4 బంతుల్లో 10 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను టైగా ముగించింది.

అయితే సూపర్‌ ఓవర్‌లో మాత్రం విజయం లంకవైపే నిలిచింది. ఇక ఈ ఏడాది కివీస్‌ పర్యటనకు వెళ్లిన శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఈ విజయంతో వన్డే సిరీస్‌ ఓటమికి లంక బదులు తీర్చుకున్నట్లైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డునెడిన్ వేదికగా ఏప్రిల్‌ 5న జరగనుంది.
చదవండి: భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement