బంగ్లాదేశ్‌ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్‌ హిస్టరీలోనే | Bangladesh successfully defend lowest-total in T20 World Cup history | Sakshi
Sakshi News home page

T20 WC: బంగ్లాదేశ్‌ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్‌ హిస్టరీలోనే

Published Mon, Jun 17 2024 11:25 AM

Bangladesh successfully defend lowest-total in T20 World Cup history

టీ20 వరల్డ్‌కప్‌-2024లో బంగ్లాదేశ్‌ సూపర్‌-8కి చేరింది. సెయింట్‌ లూసియా వేదికగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్‌.. తమ సూపర్‌-8 బెర్త్‌ ఖారారు చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ బౌలర్లు కాపాడుకున్నారు. బంగ్లా బౌలర్ల దాటికి నేపాల్‌ 85 పరుగులకే కుప్పకూలింది. 

బంగ్లా యువ పేసర్‌ టాంజిమ్‌ హసన్‌ షకీబ్‌ 4 వికెట్లతో నేపాల్‌ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ముస్తఫిజుర్‌ రెహ్మన్‌ 3 వికెట్లు, షకీబ్‌ అల్‌ హసన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

బంగ్లాదేశ్‌ అరుదైన రికార్డు..
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్‌ హిస్టరీలోనే అత్యల్ప  అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకున్న జట్టుగా బంగ్లాదేశ్‌ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. 

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 113 పరుగుల మొత్తాన్ని డిఫెండ్‌ చేసింది. తాజా మ్యాచ్‌లో 106 పరుగుల టోటల్‌ను కాపాడుకున్న బంగ్లాదేశ్‌.. సఫారీల రికార్డును బ్రేక్‌ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement