Yellow Media: ఈ పత్రికలు చదవడానికా? సైకిల్ తుడవడానికా?  | Yellow Media Spreading Fake News On AP Government | Sakshi
Sakshi News home page

Yellow Media: ఈ పత్రికలు చదవడానికా? సైకిల్ తుడవడానికా? 

Published Sun, Jan 21 2024 1:50 PM | Last Updated on Tue, Jan 30 2024 1:01 PM

Yellow Media Spreading Fake News On AP Government

కోరల నిండా విషం నింపుకున్న పాములకన్నా.. వాళ్ళిద్దరూ ఇంకా ప్రమాదకరం.. వాళ్ళు చిమ్మే ఎల్లో పాయిజన్ పాము విషం కంటే అత్యంత ప్రమాదకరం. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ఎల్లో మీడియా జగన్పై, జగన్ సర్కార్పై విషం చిమ్ముతోంది.. మొదట్లో ఒకటి రెండు డోస్‌ మాత్రమే పాయిజన్ కనిపించేది. ఇప్పుడు లీటర్ల కొద్దీ విషం కక్కుతున్నారు. ప్రతిరోజూ తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో తమ పత్రికల్ని నింపేస్తున్నారు. వాటిని పత్రికలు అనడం కటంటే.. విష పుత్రికలు అనడమే కరెక్ట్.. క్రమంగా విషపు రాతల డోస్ పెంచుతూ వచ్చారు.

ఎంతలా అంటే మన ఊహలకు అందనంతలా ఇప్పుడు డోస్ పెంచారు. ఒక్కో పత్రిక రోజుకు 50కి పైగా విషపు వార్తలు రాస్తోంది. అంటే ఆ రెండు ఎల్లో పత్రికలు రోజుకు వందకు పైగా విషపు రాతలు రాసి జనాలపైకి వదులుతున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వంపై పూర్తిగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నారు? పనికట్టుకుని మరీ ఎందుకిలా రోత పుట్టించే రాతలు రాస్తున్నారు ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? 

జర్నలిజం అనే సీసా ఒక ఇజంతో ఒక నిజంతో నిండి ఉంటుంది. అందులో ఉన్న ఆ ఇజాన్ని నిజాన్ని పక్కన పడేసి పూర్తిగా అందులో విషాన్ని నింపి... రాజకీయాల్లో దాన్ని శత్రువులపై అస్త్రంగా వాడుకోవచ్చని మూడు దశాబ్దాల క్రితమే గుర్తించిన దొంగ విజన్ వున్నోడు నారా రూప చంద్రబాబు నాయుడు. మీడియా ఏం చెప్పినా జనం నమ్ముతారు.. మీడియా ఏం చెప్పినా జనం వింటారని అప్పట్లోనే గుర్తించి మెల్లగా కొన్ని పత్రికలను తన విష పుత్రికలుగా మార్చుకుని స్లో పాయిజన్ మాదిరిగా తప్పుడు వార్తలు జనంలోకి తీసుకెళ్లిన ఘనత పచ్చ బాబుకే దక్కుతుంది.

జర్నలిజం విలువలు పూర్తిగా దిగజార్చిన ఖ్యాతి కూడా ఆయనదే..! అతను విసిరే బిస్కెట్ల కోసం ఆశపడే శునక జాతి.. జర్నలిజాన్ని అమ్ముడుపోయే వస్తువుగా మార్చేసింది.  జాతి జనుల కంటే..తమ జాతి గాడి ప్రయోజనాల కోసం మీడియా విలువల్ని కిలో మీటర్ లోతులో గొయ్యి తీసి పాతి పెట్టిన క్రెడిట్ మాత్రం మన ఎల్లో తాతగారికి, అందరి కుర్చీ కింద కూర్చుని, బాత్ రూముల్లో దాక్కుని రహస్య వార్తలు సేకరించే కృష్ణయ్యగారికే దక్కుతుంది. అసలు ఎందుకీ విషపు రాతలు? వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? ఇవి పత్రికలా.. పత్రికలకు పట్టిన పీడా ?  ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ?

అడ్డగోలు రాతలు రాసి అడ్డంగా బుక్కై పోయామా.. అయినా డోంట్ కేర్. పట్టపగలు నట్ట నడివీధిలో నగ్నంగా పట్టుబడ్డామా.. అయినా డోంట్ కేర్. పచ్చి అబద్ధాలు చెప్పి పక్కా ఆధారాలతో పచ్చిగా దొరికిపోయామా...అయినా డోంట్ కేర్. అందరి ముందు ముసుగు తొలగిపోయి నిజస్వరూపం బయట పడిపోయిందా...అయినా డోంట్ కేర్. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు వార్తలు రాసేద్దాం.. ప్రజల మధ్యకు వదిలేద్దాం..! జగన్ చేస్తున్న సంక్షేమాన్ని, అబివృద్దిని పచ్చ పత్రికలతో కప్పేద్దాం ...ఇలానే ఉంది ఈ విష పత్రికల తీరు.

ఒక్క మాటలో చెప్పాలంటే బాబుగారి కూలి పత్రికలు.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పోటీ పడతాయి.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడంలో ముందుంటాయి.. మంత్రులు, వైఎస్ఆర్ సీపీ నేతలపై విమర్శలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తాయి.. ప్రభుత్వం చేసే మంచి పనులపై తప్పుడు రాతలు రాయడంలో మేమే ఫస్ట్ అంటాయి. పేదలపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తాయి. మంచి చేసే వ్యవస్థలను నోటికొచ్చిన ఆరోపణలు చేయడంలో పోటీ పడతాయి. వీటి పనేంటో తెలుసా.. ప్రజలకు నిజాలు చెప్పడం కాదు. అందంగా అబద్ధాలను వండి వార్చడం. ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించడం. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం. 

బాబుగారి కూలి పత్రికలు అదే పనిగా అబద్ధాలను అచ్చేసి వదిలేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం...
1. ప్రభుత్వంపై ఎందుకిలా విషం చిమ్ముతున్నారు? 
2. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు కథనాలు ఎందుకు వండి వారుస్తున్నారు ?
3. ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? 
4. వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ?

పదే పదే బాబుగారి విషపు పత్రికలు అబద్ధాలను అచ్చేస్తున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలివే! ఎల్లో తాతగారి పత్రిక, కుర్చీ కింద కృష్ణయ్య గారి పత్రిక ఒక్కసారి ఓపెన్ చేసి తీక్షణంగా చూడండి. మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఓసారి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు లెక్క పెట్టి చూడండి. ఒక్కో పత్రికలు సుమారుగా 50కి పైగా వార్తలు మీకు కనిపిస్తాయి. అంటే ఈ రెండు పత్రికల్లో రోజుకు సుమారుగా వందకు పైగా తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారన్న మాట. ఈ లెక్కన ఏడాదికి 365 రోజులు అంటే.. 36 వేల 500 తప్పుడు వార్తలు. అవును ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఇది నిజంగా నిజం. ఇంకా డౌట్ ఉంటే ఓ వారం రోజులు ఆ దిక్కుమాలిన పేపర్లు దగ్గర పెట్టుకుని.. విషపు వార్తలు ఎన్ని వున్నాయో లెక్క పెట్టి చూడండి... నేను చెప్పిన లెక్క తక్కువ కాదు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. 

వీటి పనంతా ప్రభుత్వంపై బురద జల్లడం ప్రభుత్వాన్ని బద్నాం చేయడం. దీనికోసం బాబుగారి నుంచి సెపరేట్ పేమెంట్లు ఉంటాయ్. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఇంచార్జీల మార్పులు చేర్పులు చేస్తుంటే దానిపైనా విషం కక్కుతున్నారు. ముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు మాకొద్దు బాబోయ్ మాకొద్దు అంటున్నారని ఓ వార్త రాస్తారు. మరుసటి రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో టికెట్ కోట్లు పలుకుతోందని రాస్తారు. ఆ వార్తకు ఈ వార్తకు అసలు సంబంధమే లేదు. ఏదేమైనా జనాల మెదళ్లలోకి విషాన్ని నింపడమే వీళ్ల టార్గెట్. మరి టీడీపీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటిస్తే మాత్రం ఆ వార్త జోలికి పోరు. వాటిని మెయిన్ పేజీల్లో అచ్చేయరు. అలా చేస్తే బాబుకు డ్యామేజీ కాబట్టి.

ఈసారి ఎన్నికల్లో గెలిచే దారి బాబుకు కనిపించడం లేదు. కొడుకుతో పాదయాత్ర చేయించాడు కుదర్లేదు. జైల్లో ఉండగా భార్యతో చెక్కులు పంపిణీ చేశాడు పావుకిలో సింపతీ రాలేదు. పీకేను తెచ్చేకున్నాడు ఉపయోగం లేదు. మరో పీకేతో చర్చలు జరిపాడు.. అయినా నమ్మకం కుదర్లేదు. ఎయిర్ పోర్టులో డీకేను కలిశాడు.. అయినా ఐసీయూలో ఉన్న పార్టీని బతికించే దారి కనిపించ లేదు. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు.. అయినా జగన్ అదరలేదు బెదరలేదు. ఇక చేతిలో ఉన్న అన్నీ అస్త్రాలు వాడేసిన బాబు.. మిగిలిన ఒకే ఒక్క విషపు అస్త్రాన్ని మరింత బలంగా వాడుతున్నాడు. అదే ఎల్లో మీడియా.

ఆంధ్రాలో జనరంజక పాలన నడుస్తుంటే.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే.. అభివృద్ధి పరుగులు పెడుతుంటూ.. చూసి ఓర్వలేక అబద్ధాలను అచ్చేసి ఆనందిస్తున్నారు చంద్రబాబు, ఆయన కూలి మీడియా. నిజం చెప్పకపోవడం అబద్ధం.. అదే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం..! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు చేస్తోంది పచ్చి మోసం. దానికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకోక తప్పదు.

సార్ ఒక్క విషయం చెప్పనా.. 700 సంవత్సరాల క్రితం బద్దెన ఓ పద్యం రాసారు శార్.. తలనుండు విషము ఫణికిని....వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్...తలతోక యనక యుండును.. ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! పాముకి తలలో, తేలుకు తోకలో విషం వుంటుంది...కానీ శరీరమంత విషం నిండిన వారు ఈ భూలోకంలో ముగ్గురే ముగ్గురు వున్నారు.. కుప్పం, ఎల్లో తాత, బాత్ రూం క్రిష్ణయ్య.. చెప్పాను కదా 700 సంవత్సరాల క్రితమే ఈ ముగ్గురు గురించి... బద్దెన ఊహించారు. అందుకే ఈ పద్యం రాశారు.

చదవండి: రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement