నేడు కాంగ్రెస్‌ రెండో జాబితాకు ‘సీఈసీ ఆమోదం’! Telangana Congress Candidates Second List Released Oct 25th | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌ రెండో జాబితాకు ‘సీఈసీ ఆమోదం’!

Published Wed, Oct 25 2023 3:41 AM | Last Updated on Wed, Oct 25 2023 3:41 AM

Telangana Congress Candidates Second List Released Oct 25th  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన కాంగ్రెస్‌ పార్టీ తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బుధ వారం జరగనున్న కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీ సిద్ధం చేసిన జాబితాకు కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. ఇప్పటికే పొత్తులు సహా తుది జాబితాపై ఏఐసీసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది.

సీఈసీ సమావేశంలో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఒక స్పష్టత రానుంది. ఇప్పటివరకు కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరిద్దరి పేర్ల ను స్క్రీనింగ్‌ కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల తర్వాత మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ శని, ఆది వారాల్లో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌ నివాసంతోపాటు కాంగ్రెస్‌ వార్‌ రూంలో తెలంగాణ నేతల సమావేశమైనా పోటీ ఎక్కువగా ఉన్న స్థానాలపై ఏకాభిప్రాయం రాలేదు.

సీనియర్‌ నాయకులు పోటీకి సిద్ధమైన చోట అంతర్గత పోటీ ఉన్నందున స్క్రీనింగ్‌ కమిటీలో మరోసారి ఈ స్థానాల్లో పోటీకి సంబంధించి సమీక్ష జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు అడుగుతున్న స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌ అభ్యర్థులు సిద్ధంగా ఉండటంతో ఏ స్థానాలు కేటాయించాలన్న అంశంపై కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమ య్యాయని సమాచారం. కాగా, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన తుది నిర్ణయాన్ని కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీకి స్క్రీనింగ్‌ కమిటీ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరుగ నున్న సీఈసీ సమావేశం కీలకంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement