ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు | TDP Funding To Fake Movements Against Government | Sakshi
Sakshi News home page

ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు

Published Tue, Jan 9 2024 10:02 AM | Last Updated on Fri, Feb 2 2024 2:01 PM

TDP Funding To Fake Movements Against On Government - Sakshi

ఆఖరుకు రాజకీయాలు అలా తయారయ్యాయి.. ప్రజలు.. కార్మికులు.. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాల్సిన ఉద్యమ పార్టీలు డబ్బుకు అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో లేని కారణాలు సృష్టించి.. ఉద్యోగుల్లోనూ, అంగన్ వాడీల్లోనూ లేని అసంతృప్తిని రేకెత్తించి వాళ్లను ఉద్యమాలవైపు నడిపిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో కార్మిక.. ఉద్యోగ.. విద్యార్ధివర్గాల్లో అసంతృప్తి ఉందన్న భావనను విస్తృతం చేయడం.. ప్రభుత్వ వ్యతిరేకతను మరింత రాజేయడం వారి లక్ష్యం.

అయితే ఇదంతా ఊరకనే చేయరు.. అటు ప్రతిపక్ష తెలుగుదేశానికి లబ్ది చేకూర్చడానికి వారు ఎన్నికల్లో గెలవడానికి తమవంతు పాత్ర పోషించే క్రమంలో ఫీజు తీసుకుని ఇలా ఉద్యమాలు చేస్తుంటారు అన్నమాట. అన్ని వర్గాల ప్రజలకు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందుతుండడంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. వారినుంచి ఎలాంటి అసంతృప్తి లేదు. ఉద్యోగుల్లో అంగన్ వాడీలు.. ఇంకా ప్రభుత్వ సిబ్బందికి సైతం ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. మరి అలాంటపుడు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం తెలుగుదేశం వల్లకాదని అర్థం చేసుకున్న ఆ పార్టీ పెద్దలు.. నేరుగా ఉద్యమపార్టీలను లైన్లో పెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను వారికి కోట్లకు కోట్లు ప్రతిపక్ష టీడీపీ ముట్టజెప్పినట్లు తెలిసింది. 

ఈ డబ్బును జిల్లాల యూనిట్ల బాధ్యులకు కాస్త పంపించి ఉద్యమాలకు ఉసిగొల్పుతున్నట్లు తెలిసింది. అందుకే కారణం లేకుండానే అంగన్ వాడీలు సైతం ఆందోళనలకు దిగారు. వారికి గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహాన్ని సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న జీతాలను జగన్మోహన్‌రెడ్డి పెంచి.. వారికి ఉద్యోగభద్రత కల్పించడమే కాకుండా పదోన్నతుల్లో వారికి మరిన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అయినా సరే అకస్మాత్తుగా వారు సమ్మెకు దిగారు. గతంలో జగన్‌కు క్షీరాభిషేకాలు చేసినవాళ్లే ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని సందేహిస్తున్న వారికి అసలు కారణం తెలుస్తోంది. 

వాస్తవానికి 2014-19 మధ్య అంగన్ వాడీలు.. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు పెద్దగా చేసిందేమి లేదు కానీ ఆనాడు ఉద్యమాలు పెద్దగా చేసింది లేదు. అంటే అప్పుడు మిన్నకుండడానికి సైతం పేమెంట్ ముట్టిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇన్నేళ్లు ఊరుకున్న ఉద్యోగులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోడ్లెక్కడం వెనుక ఆ పార్టీల పెద్దల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయన్నది అవగతం అవుతున్నది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఏమీ చేయకపోయినా పల్లెత్తుమాట అనలేదు కదా చంద్రబాబుని.. పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు మాత్రం.. ఉపాధ్యాయ.. విద్యార్ధి.. ఇతర ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి వారి ఖర్చులు.. ధర్నాల టెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ ఆందోళనలు చేయిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. 

-- సిమ్మాదిరప్పన్న
చదవండి: ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement