ఇన్‌చార్జులపై ‘రూకలు’పోటు TDP conspiracy in Adoni division | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జులపై ‘రూకలు’పోటు

Published Sun, Feb 11 2024 5:33 AM | Last Updated on Sun, Feb 11 2024 5:38 AM

TDP conspiracy in Adoni division - Sakshi

సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ మసిబూసి మారేడు కాయ చేసి ప్రస్తుత ఇన్‌చార్జులను వంచించేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు వారిచేత డబ్బులు ఖర్చుచేయించి ఇప్పుడు రోకలిపోటుకు సిద్ధమైంది. మంత్రా ల యం, ఎమ్మిగనూరు, ఆదోనిలో అభ్యర్థులను మార్చేందుకు యోచిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై టీడీపీ జోన్‌–4 ఇన్‌చార్జ్‌ బీద రవిచంద్రయాదవ్‌ పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జ్‌లు డైలమాలో పడ్డారు.
 
ఎమ్మిగనూరు ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కొన­సాగు­తున్నారు. ఇప్పుడు ఆయనను కాదని మాచాని సోమ­­నాథ్‌ను బరిలోకి దించే యోచనలో టీడీపీ ఉంది. శనివారం కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సోమనాథ్‌ను కలిశా­రు. టికెట్‌ విషయం ప్రస్తావించారు. అయితే సమయం ఇవ్వాలని ఆలోచించి చెబుతా మని సోమనాథ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. సోమనాథ్‌కు టికెట్‌ ఇస్తే జయనాగేశ్వరరెడ్డి రాజకీయ ప్రయాణం ముగిసినట్లే! ఆదోని ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నాయుడు కొనసాగు­తున్నారు.

పొత్తులో భాగంగా జనసేన తరఫున సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ టికెట్‌ దక్కించుకోవాలని భావిస్తున్నారు. కుదరకపోతే తానే టీడీపీ తరఫున బరిలోకి దిగాలనే యోచన కూడా చేస్తున్నట్లు తెలు స్తోంది. టీజీ వెంకటేశ్‌కు బంధువు కావడంతో విశ్వప్రసాద్‌కు టికెట్‌ ఇప్పించేందుకు వెంకటేశ్, భరత్‌ కూడా యత్నిస్తున్నట్లు తెలు స్తోంది.

దీంతో మీనాక్షి­నాయుడు శుక్రవారం ఆదోని లో సదస్సు నిర్వహించారు. ‘ఎవరంటే వారు టికెట్‌ అడుగు­తున్నారని, ఇదేమైనా సినిమా టికెట్టా? అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నట్లు తె లుస్తోంది. తనకేనా లేదా తన కుమారుడు భూపాల్‌ నాయుడుకైనా టికెట్‌ వస్తుందని,లేనిపక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం.    

మంత్రాలయంలో రాఘవేంద్ర జపం 
మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌గా తిక్కారెడ్డి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తిక్కా రెడ్డి  ఓడారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కాకుండా బీసీ వర్గానికి చెందిన రాఘవేంద్రని బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తోంది.

ఇటీవల టీడీపీలో చేరిన రాఘవేంద్ర.. చంద్రబాబును కలిశారు. కచ్చితంగా బీసీలకే టిక్కెట్‌ ఇస్తామని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని రాఘవేంద్రకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 2 ఎన్నికల్లో టీడీపీ కోసం భారీగా ఖర్చు చేశానని, తనకు టి కెట్‌ ఇవ్వకపోతే పార్టీలో కొనసాగనని తిక్కారెడ్డి తన వర్గీయులతో చెప్పినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement