మాజీ మంత్రికి బాధ్యతలు; కార్యకర్తల నిరసన | TDP Activists Protested Opposes To Samuel Johar In Kovvuru Constituency | Sakshi
Sakshi News home page

టీడీపీ అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు

Published Sat, Oct 3 2020 5:37 PM | Last Updated on Sat, Oct 3 2020 5:49 PM

TDP Activists Protested Opposes To Samuel Johar  In Kovvuru Constituency - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌కు టీడీపీ అధిష్టానం రాజమండ్రి పార్లమెంటరీ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడంపై కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా కొవ్వూరు పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జవహర్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని లేదంటే కొవ్వూరు నియోజకవర్గానికి ఇంచార్జ్ వేరే ఒకరిని నియమించాలని తీర్మానించారు. (టీడీపీ కుట్ర.. ఆధారాలు బట్టబయలు)

కొవ్వూరు నియోజకవర్గంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందని ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, 2014లో కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాక పార్టీలో వర్గ విభేదాలు సృష్టించి కార్యకర్తలపై కేసులు పెట్టించి పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యారని నాయకులు వాపోయారు. అందువల్ల కొవ్వూరు నియోజకవర్గానికి వేరొకరిని నియమించి పార్టీని ఆదుకోవాలని ఆయన కోరారు. (‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement