కుదిరిన సీట్ల ఒప్పందం.. కాంగ్రెస్‌కు ఏడు! | INDIA Bloc Seat-Sharing In Jharkhand, Congress To Contest On 7 Seats | Sakshi
Sakshi News home page

Jharkhand: కుదిరిన సీట్ల ఒప్పందం.. కాంగ్రెస్‌కు ఏడు!

Published Thu, Mar 21 2024 6:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:48 AM

Seat sharing in jharkhand Congress to Contest on 7 Seats - Sakshi

జార్ఖండ్‌లో విపక్ష కూటమి ‘ఇండియా’తో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని  మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, జేఎంఎం ఐదు స్థానాల్లో పోటీ చేయనుంది. మరికొన్నింటిలో ఎమ్మెల్యేలతో పాటు ఐఎంఎల్ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. 

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ బీహార్‌లో కూడా పొత్తు విషయపై చర్చలు జరిగాయని, అవి సఫలం అయ్యాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కాగా ఆర్జేడీకి జార్ఖండ్‌లోని చత్రా సీటు కేటాయించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా దుమ్కా లోక్‌సభ స్థానంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ఈ స్థానానికి చెందిన సోరెన్ కోడలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. 

మరోవైపు బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు సంబంధించి రబ్రీ దేవి నివాసంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఆర్జేడీ 25 నుంచి 28 స్థానాల్లో పోటీ చేయనుందని, కాంగ్రెస్‌కు 8 నుంచి 9 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కి రెండు సీట్లు, సీపీఐకి ఒక సీటు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

గతంలో జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్థానాలలో 12 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఇందులో ఒక సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతా కోడా కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. అయితే ఇప్పుడు  ఆమె కూడా బీజేపీలో చేరారు ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారేలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement