ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల | Sajjala Ramakrishna Reddy Suspects EC Behaviour Over Macharla EVM Video Leak, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల

Published Thu, May 23 2024 12:39 PM | Last Updated on Thu, May 23 2024 3:11 PM

Sajjala Suspects EC Behaviour Over Macharla EVM Video Leak

13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు!

మొత్తం ఏడు ఈవీ సంబంధిత ఘటనలు

పిన్నెల్లి ఇన్‌వాల్వ్‌ అయిన ఒక్క పాల్వాయి గేట్‌ ఉదంతం వీడియోనే లీక్‌

ఈసీ ప్రకటనలపై అనుమానాలు

అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడులు.. వెలుగులోకి వీడియోలు

అయినా చర్యలు తీసుకోని ఈసీ?!

ఈసీకి ప్రశ్నలు సంధించిన సజ్జల

గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్‌ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 

‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వస్తుంది?.. 

 

 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్‌ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 

 

అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. 

ఈసీకి సజ్జల 10 ప్రశ్నలు


వీటికి సమాధానాలేవీ?

  • 13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?
  • గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?
  • స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?
  • పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?
  • ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్‌ ఆ ఫుటేజీని చూడలేదా?
  • అసలు ఇంతకాలం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఏం చేశారు?
  • మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్‌వాల్వ్‌ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement