టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు? Sajjala Ramakrishna Reddy comments on TDP | Sakshi
Sakshi News home page

టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?

Published Fri, May 24 2024 6:10 AM | Last Updated on Fri, May 24 2024 6:10 AM

Sajjala Ramakrishna Reddy comments on TDP

ఒక్క పాల్వాయి గేట్‌ వీడియోనే ఎలా లీక్‌ అయ్యింది?

అది కూడా చిన్న క్లిప్పింగే ఎలా బయటకు వచ్చింది?

7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఎన్నికల కమిషనే చెబుతోంది

ఆ వీడియోలను ఎందుకు రిలీజ్‌ చేయట్లేదు?

అమాయక ఓటర్లపై దాడులు చేసిన టీడీపీ గూండాలపై చర్యలకెందుకు వెనుకాడుతున్నారు? 

ఎన్నికల కమిషన్‌కు ప్రశ్నలు సంధించిన సజ్జల  

సాక్షి, అమరావతి: అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు సాక్ష్యాలున్నా చర్యలెందుకు తీసుకోవట్లేదని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోషల్‌ మీడియా వేదికగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించారు. అలాగే పోలింగ్‌ రోజున మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమం (ఎక్స్‌)లో పోస్టు చేశారు. ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైనదేనా? కాదా? అనేది నిర్ధారించకుండానే ఈసీ చర్య­లకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వచి్చంది? మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజున ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఎన్నికల కమిషనే చెబుతోంది.

అలాంటప్పుడు కేవలం ఈ ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేశారు? ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను.. 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలను ఎందుకు బయటపెట్టట్లేదు? ఒక చిన్న క్లిప్పింగ్‌ మాత్రమే బయటకు ఎలా వదిలారు?అన్ని వీడియోలు బయటకు వస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది కదా! తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?’ అని సజ్జల ప్రశి్నంచారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమా­యక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సజ్జల చెప్పారు.

వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని నిలదీశారు. టీడీపీ మూకల రిగ్గింగ్‌లపై తాము ఫిర్యాదు చేసిన అన్నిచోట్లకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు కచి్చతంగా ఉందన్నారు. మాచర్లలో ప్రజాబలమున్న పిన్నెల్లి  ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలి­చారని.. ఐదోసారి కూడా గెలవబోతున్నారని చెప్పారు. ఏదో నలుగురు అధికారులను మేనేజ్‌ చేసి.. అవసరమైనంత వరకే వీడియోను కట్‌ చేసి.. దొంగ వీడియోలను లీక్‌ చేసి.. కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement