జగిత్యాల కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. ఎమ్మెల్సీకి జీవన్‌ రెడ్డి రాజీనామా? | Political Suspense Over Jagtial Congress And Jeevan Reddy | Sakshi
Sakshi News home page

జగిత్యాల కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. ఎమ్మెల్సీకి జీవన్‌ రెడ్డి రాజీనామా?

Published Mon, Jun 24 2024 10:43 AM | Last Updated on Mon, Jun 24 2024 11:26 AM

Political Suspense Over Jagtial Congress And Jeevan Reddy

సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్‌లో కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. సీనియర్‌ నేతలకే పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి జీవన్‌ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరికపై స్థానిక నేత జీవన్‌ రెడ్డికి అధిష్టానం సమాచారం ఇవ్వలేదు. ఇక, సంజయ్‌ చేరికపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో అసహనం నెలకొంది. దీంతో, జీవన్‌ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సోమవారం ఉదయం నుంచే జీవన్‌ రెడ్డి ఇంటికి కాంగ్రెస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు.. జీవన్‌తో అధిష్టానం మాట్లాడుతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. అంతకుముందు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతీ రాజకీయ పార్టీ వారి సిద్దాంతాలకు అనుగుణంగా పని చేయాలి.. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిన పనిలేదని నా భావన’ అని కామెంట్స్‌ చేశారు. అయితే, జీవన్‌ రెడ్డి ఇలా కామెంట్స్‌ చేసిన మరుసటి రోజే జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరారు విశేషం.

సీఎం రేవంత్‌ సమక్షంలో ఆదివారం సంజయ్‌ కుమార్‌ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీలో రెండు పవర్‌ సెంటర్స్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. కాగా, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌ ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement