నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్‌దే: కేటీఆర్‌ | KTR Comments Nizamabad Parliament Constituency BRS Activists Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్‌దే: కేటీఆర్‌

Published Mon, Jan 8 2024 1:29 PM | Last Updated on Mon, Jan 8 2024 1:46 PM

KTR Comments Nizamabad Parliament Constituency BRS Activists Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్ ఎంపీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో​ ఈ సారి త్రిముఖ పోరు జరగనుందని అ‍న్నారు.

నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

చదవండి: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌ పీఠం ‘హస్త’గతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement