Kodali Nani Satirical Comments On Janasena Pawan Kalyan Ippatam Issue - Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పొలిటికల్‌ టూరిస్టులు: కొడాలి నాని

Published Sat, Nov 5 2022 4:39 PM | Last Updated on Sat, Nov 5 2022 5:13 PM

Kodali Nani Satirical Comments On Janasena Pawan Kalyan - Sakshi

సాక్షి, గుడివాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతి ఉంటే మాట్లాడుతున్నారా?. డీజిల్‌, గ్యాస్‌ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా?. పవన్‌, చంద్రబాబు వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శనివారం గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు పొలిటికల్‌ టూరిస్టులు. హైదరాబాద్‌లో రెక్కీ డ్రామా జరిగినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే సంబంధమా?. రెక్కీ పేరుతో పవన్‌ గాలిమాటలు మాట్లాడాడు. జూబ్లీహిల్స్‌లో రెక్కీ జరిగితే చంద్రబాబుకు ఏం సంబంధం?. 

అప్పుడు పవన్‌ విశాఖలో ఐదు నానా హంగామా చేశారు. ఇప్పుడు ఇప్పటం వెళ్లి మరోసారి పవన్‌ నానా హంగామా చేశారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంటే టీడీపీకి నిద్రపట్టడం లేదు. కేపీ పాల్‌లా పవన్‌ ఇప్పటంలో పరుగులు పెట్టారు. మునుగోడులో కేఏ పాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రక్తి కట్టించాడు. కేఏ పాల్‌ కన్నా వెనకబడిపోయానని పవన్‌ ఇప్పటం వచ్చాడు. షో అయిపోగానే 2 గంటల కల్లా వెళ్లిపోయారు. 

రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయి. లేని సమస్యలను పవన్‌, చంద్రబాబు సృష్టిస్తున్నారు. వారిద్దరూ వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారు. తాగుబోతులు పవన్‌ ఇంటి ముందు హడావుడి చేస్తే రెక్కీ అన్నారు. గులకరాయితో చంద్రబాబుపై హత్యయత్నం జరిగిందంట.. తనపై రాయి విసిరారని చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. చంద్రబాబే తన పార్టీ కార్యకర్తలతో రాళ్లు వేయించుకున్నాడు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా?. ప్రధాని మోదీని అడిగే దమ్ము పవన్‌, చంద్రబాబుకు లేదు. పవన్‌ రాజకీయ అజ్ఞాని.

ఇడుపులపాయలో హైవే వేయాలంటే పవన్‌ ప్రధాని అవ్వాలి. ప్రధాని అవ్వడం కోసం పవన్‌.. కేఏ పాల్‌తో పోటీ పడుతున్నాడా?. జనసేన తరఫున 300 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని అవ్వమనండి. అప్పుడు ఇడుపులపాయలో కాదు. గుడివాడలో కూడా హైవే వేసుకోమనండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘పవన్‌ కల్యాణ్‌కు షాకిచ్చిన ఇప్పటం ప్రజలు..’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement