కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక: బీఆర్‌ఎస్‌ టికెట్‌ మళ్లీ ఆ ఫ్యామిలీకే ? | KCR Decides To Give Contonment By Election Ticket Again To Sayanna Family - Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక: బీఆర్‌ఎస్‌ టికెట్‌ మళ్లీ ఆ ఫ్యామిలీకే..?

Published Sun, Apr 7 2024 7:16 PM | Last Updated on Mon, Apr 8 2024 10:34 AM

Kcr Decides To Give Contonment By Election Ticket Again To Sayanna Family - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కంటోన్మెంట్‌  ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదివారం(ఏప్రిల్‌ 7) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్  సమావేశమై కంటోన్మెంట్‌  ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ముఖ్య నేత హరీశ్‌రావు, మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. 

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే బీఆర్‌ఎస్‌ టికెట్‌ మళ్లీ దక్కడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల సాయన్న కూతురు  సిట్టింగ్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో ఈ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దింపాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిని అధికారికంగా మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ టికెట్‌ ఆశించిన బీఆర్‌ఎస్‌ నేతలు పలువురు ఈ ఉప ఎన్నికలోనూ టికెట్‌ కోసం పార్టీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీరందరి అభ్యర్థిత్వంపై చర్చించిన తర్వాత టికెట్‌ సాయన్న కుటుంబానికే ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గణేష్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా పార్టీ ఆయనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement