ప్రభుత్వ ఆస్పత్రికే రెఫర్‌ చేయాలి - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రికే రెఫర్‌ చేయాలి

Published Fri, Jun 21 2024 11:56 PM | Last Updated on Fri, Jun 21 2024 11:56 PM

ప్రభు

పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందేలా సహకరించండి

కేసులు బయటకు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోండి

సమన్వయంతో పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందిద్దాం

డీఎంహెచ్‌ ప్రమోద్‌కుమార్‌, సిమ్స్‌ ప్రిన్సిపాల్‌ హిమబిందుసింగ్‌

జీజీహెచ్‌లో కనీస మర్యాద లేదని సిబ్బంది ఆవేదన

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభు త్వ సింగరేణి మెడికల్‌ కాలేజీ(సిమ్స్‌)కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ బోధన ఆస్పత్రి(జీజీహెచ్‌) లో అన్నిరకాల నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని, పేషెంట్లను బయటి ఆస్పత్రులకు కాకుండా జీజీహెచ్‌కే రెఫర్‌ చేయాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌, సిమ్స్‌ ప్రిన్సిపాల్‌ హిమబింద్‌సింగ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దయాల్‌సింగ్‌ కోరారు. జీజీహెచ్‌లో ఓపీ కేసులతోపాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య పెంచడంపై మెడికల్‌ కాలుజీలో శుక్రవారం సన్వయ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో కృపాబాయి హాజరయ్యారు. నగరంలోని ఆరు యూపీహెచ్‌సీలు, ఒక పీహెచ్‌సీ, రెండు బస్తీదవాఖాలు, రెండు సబ్‌సెంటర్ల మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. పిల్లలు, ప్రసూతి, జనరల్‌ సర్జరీ, మానసిక వైద్యం, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, ఆర్థో, యూరాలజీ, న్యూరాలజీ తదితర ప్రత్యేక వైద్యులు ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తునఆనరని వారు వివరించారు. ఆయా ఆస్పత్రులకు వస్తున్న పేషెంట్ల సమస్యను బట్టి జీజీహెచ్‌కు రెఫర్‌ చేస్తే.. అవసరమైన నాణ్యమైన వైద్యచికిత్సలు అందిస్తారని తెలిపారు. జీజీహెచ్‌లో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారనే విషయం ప్రజలకు తెలియకపోవడంతోనే ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని వెల్లడించారు. ఔట్‌ పేషెంట్ల సంఖ్యతోపాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య(బెడ్‌ ఆక్యూపెన్సీ) పెంచడానికి మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు సహకరించాలని వారు కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వ ఆస్పత్రికే రెఫర్‌ చేయాలి
1/1

ప్రభుత్వ ఆస్పత్రికే రెఫర్‌ చేయాలి

Advertisement
 
Advertisement
 
Advertisement