లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆత్మహత్య

Published Fri, Apr 19 2024 1:40 AM | Last Updated on Fri, Apr 19 2024 1:40 AM

మృతుడు
శ్రీనివాసరాజు (ఫైల్‌) - Sakshi

లక్కవరపుకోట :

మండలంలోని ఒక చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకలపాటి శ్రీనివాసరావు (47)గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు తెలిపిన వివరాలు... నిందితుడు వారం రోజుల కిందట 8 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి యత్నించాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా అప్పటి నుంచి నిందితుడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆదివారం 10 గంటల ప్రాంతంలో ఎస్‌.కోట ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో పురుగులు మందు సేవించి అపస్మారక స్థితికి శ్రీనివాసరావు చేరుకోవడంతో స్థానికుల సహాయంతో ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మండల కేంద్రం కిత్తన్నకట్టు గెడ్డ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి పరిశీలించగా మృతదేహం నిందితుడు శ్రీనివాసరాజుగా గుర్తించారు.

ఈ మేరకు మృతుడు తల్లి, తమ్ముడులకు సమాచారం అందించగా మృతదేహాన్ని వారు వచ్చి పరిశీలించి శ్రీనివాసరాజు అని నిర్ధారించారు. మృతుడు తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాలరావు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement