న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే | New Jersey Indian Woman Shot Dead By Indian Origin Man, Another One Critical | Sakshi
Sakshi News home page

న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే

Published Mon, Jun 17 2024 2:32 PM

New Jersey Indian woman shot dead  by Indian origin man, another critical

అమెరికాలోని  న్యూజెర్సీలో  పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలపై భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. న్యూజెర్సీలోని కార్టెరెట్‌లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్‌ జరిపిన కాల్పుల్లో  జస్వీర్ కౌర్  (29) మరణించారు.  గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ కాల్పుల్లో మరో మహిళ,జస్వీర్ బంధువు  గగన్‌దీప్ కౌర్  (20) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. నిందితుడు గిల్ నాకోదర్‌లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని, బాధితులు జలంధర్‌లోని నూర్‌మహల్‌కు చెందినవారని తెలుస్తోంది.  నిందితుడు గౌరవ్ గిల్‌ను హత్య కేసులో అరెస్టు చేశారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.

హత్యకు గురైన జస్బీర్ కౌర్  తన బంధువు గగన్‌దీప్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సమయంలో  అతడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. పంజాబ్‌లోని నకోదర్ పట్టణంలోని IELTS కోచింగ్ సెంటర్‌లో గగన్‌దీప్‌తో గిల్‌కు పరిచయమున్నట్టు తెలుస్తోంది.   కాగా జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్‌గా ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేసింది.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement