చైనాలో నలుగురు అమెరికన్లపై దాడి American Citizens Brutally Stabbed in Park in China | Sakshi
Sakshi News home page

చైనాలో నలుగురు అమెరికన్లపై దాడి

Published Tue, Jun 11 2024 1:28 PM | Last Updated on Tue, Jun 11 2024 1:28 PM

American Citizens Brutally Stabbed in Park in China

చైనాలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. నలుగురు అమెరికన్ అధ్యాపకులపై దాడి జరిగింది. దుండగులు అధ్యాపకులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. చైనాలోని ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లోని ఒక పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ  అధ్యాపకులంతా చైనాలోని తమ భాగస్వామ్య  విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ ఘటన నేపధ్యంలో అయోవా కాంగ్రెస్ ప్రతినిధి మరియాన్నెట్ మిల్లర్ మీక్స్ మాట్లాడుతూ ఈ దాడిలో గాయపడిన అధ్యాపకులను తగిన వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ దాడికి సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వ అధికారులు  వెల్లడించారు. కార్నెల్ కళాశాల అధ్యాపకులు చైనాలోని భాగస్వామ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తుండగా ఈ దాడి జరిగిందని వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌ తెలిపింది. కార్నెల్ కాలేజ్ ప్రెసిడెంట్ జోనాథన్ బ్రాండ్  ఈ ఘటనను ధృవీకరించారు.

మరోవైపు ఈ దాడికి సంబంధించిన నివేదికలు తమకు అందాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యాపకులు ఏ మేరకు గాయపడ్డారు? వీరిపై దాడికి కుట్ర జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కార్నెల్ ప్రతినిధి జెన్ వీజర్ తెలిపారు. కాగా అమెరికా పౌరులపై దాడి ఘటనను చైనా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement