నిర్మల్‌ - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Fri, Jun 21 2024 11:42 PM | Last Updated on Fri, Jun 21 2024 11:42 PM

నిర్మ

ఘనంగా వటసావిత్రి వ్రతం
జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా వటసావిత్రి వ్రతాన్ని మహిళలు ఘనంగా జరుపుకు న్నారు. కుటుంబం కోసం ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది.

శనివారం శ్రీ 22 శ్రీ జూన్‌ శ్రీ 2024

9లోu

కలెక్టర్‌ను కలిసిన

బీజేపీ నాయకులు

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అభిలాష అభినవ్‌ను బీజేపీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసినవారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ కన్వీనర్‌ అయ్యన్నగారి భూమయ్య, సీనియర్‌ నాయకులు రావుల రామనాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిలు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్‌రెడ్డి, నిర్మల్‌ అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీగాదె విలాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు అలివేలు మంగ, జిల్లా కార్యదర్శి కొరిపెల్లి శ్రావణ్‌రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్‌, పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్‌, బీజేవైఎం నిర్మల్‌ అసెంబ్లీ కన్వీనర్‌ కొండాజి శ్రావణ్‌, సర్పంచ్‌ అంకం శ్రీనివాస్‌, చలపతి తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌: ‘హమ్మయ్య.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇప్పటికీ సర్కారు కరుణించింది. ఏడాదికేడాది పంట మీద అప్పు పెరుగుకుంటా పోయింది. లక్ష దాటి రెండు లక్షలకు చేరింది. పండించిన పంటలు పెట్టిన పెట్టుబడికే సరిపోతుండటంతో రుణం కట్టడం కష్టమైంది. ఇప్పుడు సర్కారు ఒకేసారి రూ.రెండులక్షల రుణం మాఫీ చేస్తామనడంతో పాణం సల్లవడ్డట్లయ్యింది...’ అని జిల్లా రైతులు అంటున్నారు. రూ.2లక్షల వరకు రైతురుణాలను మాఫీకి రాష్ట్ర మంత్రివర్గ కేబినేట్‌ ఆమోదం తెలుపడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

వాళ్లకే వర్తిస్తుంది..

ప్రస్తుత సీజన్‌ నేపథ్యంలో రైతు సంక్షేమ చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ చర్చించింది. ప్రధానంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో బాగా ప్రచారం చేసిన రైతు రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2023, డిసెంబర్‌ 9ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించింది. ఆ తేదీ వరకు రూ.2 లక్షలలోపు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించనున్నట్లు పేర్కొంది. అది కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే ఆగస్టు 15 లోపు మాఫీ పూర్తిచేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీసుకున్న ఈ రుణాలను మాఫీ చేసేందుకు రూ.39 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోనూ దాదాపు లక్షకుపైగా రైతులు లబ్ధి పొందనున్నారు.

ఏళ్లుగా ఎదురుచూపులు..

గత ప్రభుత్వం రూ.లక్షలోపు రైతు రుణమాఫీ చేసింది. కానీ విడతల వారీగా చేపట్టడంతో రుణమాఫీ ఎప్పుడవుతుందా.. అని రైతులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇందులోనూ కొందరికీ ఇంకా మాఫీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రుణమాఫీ కాకపోవడం, చెల్లించే పరిస్థితుల్లో లేకపోవడంతో ఇటీవల లక్ష్మణచాందకు చెందిన ఓరైతుకు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు పలు పథకాలు ప్రకటించిన గత డిసెంబర్‌ 9నే రుణమాఫీ కూడా చేస్తుందని రైతాంగమంతా భావించింది. కానీ భారీ బడ్జెట్‌తో కూడుకుని ఉండటంతో కొత్త సర్కారు సమయం తీసుకుంది. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15లోపు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని మళ్లీ హామీ ఇచ్చారు. ఈ ప్రకారం ఇప్పుడు రాష్ట్ర కేబినేట్‌ దీనిపై నిర్ణయం తీసుకుంది.

ఏకకాలంలో మాఫీ..

జిల్లాలో దాదాపు 1.87 లక్షల మంది రైతులు ఉన్నారు. 4.40 లక్షల ఎకరాలు పంట భూమి ఉంది. వ్యవసాయ భూమి ఉన్న ప్రతీరైతు ఎంతో కొంత పంట రుణం తీసుకున్నారు. చాలామంది అసలు కట్టలేని పరిస్థితుల్లో ఏటా వడ్డీలు కట్టుకుంటూ రుణాన్ని రెన్యువల్‌ చేయించుకుంటున్నారు. అలా.. తీసుకున్న రుణానికి వడ్డీ కడుతున్నా.. ఏడాదికేడాది అసలు మాత్రం పెరుగుతూ పోతోంది. రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు చేరిన రైతులకు ఇప్పుడు సర్కారు తీపికబురు చెప్పింది. తాము ఇచ్చిన హా మీ మేరకు రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. అది కూడా.. ఏకకాలంలో ఈ మొత్తాన్ని మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్లు చెప్పడంతో రైతాంగం హర్షం వ్యక్తంచేస్తోంది.

న్యూస్‌రీల్‌

రూ.2 లక్షల వరకు మాఫీకి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

2023 డిసెంబర్‌ 9 వరకు కటాఫ్‌ డేట్‌

ఆగస్టు 15 వరకు మాఫీకి కసరత్తు

హర్షం వ్యక్తం చేస్తున్న జల్లా రైతులు

‘భరోసా’ కూడా ఇస్తే..

రూ.రెండులక్షల రుణమాఫీని చేపడుతున్నట్లే రైతు భరోసానూ అమలు చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. గత యాసంగి పంటకు అంతకు ముందు ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం డబ్బులే అందించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమై నెల కావస్తున్నా.. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పేర్కొన్న రైతుభరోసా పథకం అమలు చేయలేదు. ఈ పథకం ప్రకారం ఎకరాకు రూ.15వేలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం సీజన్‌ ప్రారంభం కావడంతో ఈ మొత్తాన్ని కూడా ఇస్తే.. అటు రుణభారం తప్పడంతోపాటు పెట్టుబడికి కూడా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతుభరోసాను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పక్కాగా సాగుచేసే రైతులకే ఈ పథకం అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

బ్యాంకులో రైతులు (ఫైల్‌)

సంతోషంగా ఉంది..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు పంట భూమిపై రూ.2 లక్షల దాకా రుణం ఉంది. ఇప్పుడు ఈ రుణభారం తప్పితే.. ఇక ఇబ్బంది ఉండదు.

–గురాల లింగారెడ్డి, రైతు, మునిపెల్లి,

మం.లక్ష్మణచాంద

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మల్‌
1/1

నిర్మల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement