తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై... విడిగా విచారణ: సుప్రీంకోర్టు | Separate Inquiry on Increase of Assembly Seats in Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై... విడిగా విచారణ: సుప్రీంకోర్టు

Published Fri, Oct 14 2022 5:15 AM | Last Updated on Fri, Oct 14 2022 5:15 AM

Separate Inquiry on Increase of Assembly Seats in Telugu States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని జమ్మూకశ్మీర్‌ కేసుతో కాకుండా విడిగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్, తెలుగు రాష్ట్రాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దాఖలైన వేర్వేరు పిటిషన్లను గురువారం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకాల ధర్మాసనం విచారించింది.

జమ్ము కశ్మీర్‌ అంశంతో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఎలా జత చేస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. జమ్ము కశ్మీర్‌ చట్టం 2019లో చేశారని, ఏపీ పునర్విభజన చట్టం 2014లోనే చేశారని పిటిషనర్‌ పురుషోత్తం రెడ్డి తరఫు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, రావు రంజిత్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏకీభవించని ధర్మాసనం జమ్మూకశ్మీర్‌ అంశంతో తెలుగు రాష్ట్రాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో సీట్లపెంపు పిటిషన్లను వేరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement