రెబల్స్‌, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు? | Possibility of Rebellion of Rebels and Independents | Sakshi
Sakshi News home page

Rajasthan: రెబల్స్‌, స్వతంత్రుల టచ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు?

Published Sat, Dec 2 2023 12:11 PM | Last Updated on Sat, Dec 2 2023 12:26 PM

Possibility of Rebellion of Rebels and Independents - Sakshi

రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని మీడియా సంస్థలు భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌ వివిధ పార్టీల నేతలకు గుండె దడను పెంచాయి.  ఫలితాలు వెలువడకముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ బలమైన స్వతంత్రులను, రెబల్స్‌గా ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులతో సంప్రదింపులు మొదలుపెట్టాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం పార్టీ నుండి టిక్కెట్ రాకపోవడంతో రెబల్‌గా ఎన్నికలలో పోటీ చేసిన చిత్తోఢ్‌గఢ్ తిరుగుబాటు అభ్యర్థి చంద్రభన్ సింగ్ అక్యాతో బీజేపీ టచ్‌లో ఉందని అంటున్నారు. ఇలాంటి తిరుగుబాటు నేతలు తమ కుటుంబ సభ్యులేనని, వారు ఎక్కడికీ వెళ్లరని, వారితో టచ్‌లో ఉన్నామని బీజేపీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. 

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహా ప్రయత్నాలను ప్రారంభించింది. తమ పార్టీ రెబల్స్, స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులను కూడా సంప్రదించడం మొదలుపెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార మాట్లాడుతూ ‘గత ఎన్నికల్లో స్వతంత్రులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, తమ విజయవంతమైన పాలనకు మద్దతుగా నిలిచారని, ఇప్పుడు కూడా అదే జరగనుందని’ అన్నారు. డిసెంబర్ 3న వెలువడే ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకే మెజారిటీ వస్తుందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. 
ఇది కూడా చదవండి: పసివాడిని బావిలో తోసేసిన బాలిక.. తరువాత?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement