‘కజిరంగా’కు ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే! PM Modi Visits Kaziranga National Park In Assam | Sakshi
Sakshi News home page

Kaziranga National Park: ‘కజిరంగా’కు ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే!

Published Sat, Mar 9 2024 8:00 AM | Last Updated on Sat, Mar 9 2024 9:33 AM

PM Modi on a Tour Kaziranga National Park - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(శనివారం) నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఆయన నేడు యూపీతోపాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటిస్తున్నారు. అసోంలోని కజిరంగాలోని నేషనల్ పార్క్‌లో సఫారీతో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమయ్యింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రధాని మోదీ జీప్ సఫారీతో పాటు ఏనుగు సవారీ కూడా చేశారు. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ప్రత్యేకతల విషయానికొస్తే..

ఇది 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది.  వివిధ జాతులకు చెందిన వెయ్యికి మించిన జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక కొమ్ము గల ఖడ్గమృగం ఈ రిజర్వ్ ఫారెస్ట్‌ ప్రత్యేకత. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పార్కులో 2200కు పైగా ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అలాగే ఈ పార్క్ 180కు మించిన బెంగాల్ పులులకు నిలయం.
 

కజిరంగా నేషనల్ పార్క్ నమూనాను నాటి లార్డ్ కర్జన్ భార్య 1904లో రూపొందించారు. 1905, జూన్‌ ఒకటిన ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటయ్యింది. పార్క్ 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 1908లో గోలాఘాట్, నాగావ్ జిల్లాలను ఈ పార్కు కలిపింది. యునెస్కో దీనిని 1985లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది

కజిరంగాను 2006లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఈ పార్క్ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. మే ఒకటి నుండి అక్టోబర్ 31 వరకు పార్కును మూసివేస్తారు.  ఈ పార్కులో ఏనుగులు 1,940,వైల్డ్ బఫెలోలు 1666, జింకలు 468 ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement