సీబీఐ అరెస్ట్‌.. కోర్టులో కవితకు చుక్కెదురు | MLC Kavitha Files Petition At Delhi Special Court Against CBI Arrest | Sakshi
Sakshi News home page

సీబీఐ అరెస్ట్‌.. కోర్టులో కవితకు చుక్కెదురు

Published Thu, Apr 11 2024 4:41 PM | Last Updated on Thu, Apr 11 2024 11:07 PM

MLC Kavitha Files Petition At Delhi Special Court Against CBI Arrest - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌లు.. కేంద్ర దర్యాప్తు సంస్థల  విచారణలు.. బెయిల్‌ పిటిషన్‌లతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా లిక్కర్‌ కేసులో కవితకు చుక్కెదురైంది. లిక్కర్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. 

కవిత తరపున ఆమె లాయర్‌ మోహిత్‌ రావు.. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్‌ విచారించాలని కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సీబీఐ ఎలా అరెస్ట్‌ చేస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్‌ కాదని స్పెషల్‌ కోర్టు తెలిపింది. కవిత పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. రెగ్యులర్‌గా లిక్కర్ కేసు విచారణ జరిపే కావేరి భవేజా కోర్టులోనే వాదనలు వినిపించాలని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు.

కాగా లిక్కర్‌ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత ఇప్పటికే తీహార్‌ జైల్లో జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో హైదరాబాద్‌లో ఆమెను ప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్‌ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నేడు అరెస్ట్‌ చేసింది. ఇవాళ కోర్టులకు సెలవు కావడంతో రేపు(శుక్రవారం) తీహార్‌ జైలు నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లనుంది.  ఉదయం 10:30 కు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. కవితను వారం రోజుల పోలీస్ కస్టడీకి కోరనుంది.
చదవండి: లిక్కర్‌ స్కాంలో ట్విస్ట్‌.. కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement