25 అడుగుల జాయింట్‌ కైట్‌ ఎగురుతుందిలా.. | Makar Sankranti Festival Begins From Today | Sakshi
Sakshi News home page

Makar Sankranti: 25 అడుగుల జాయింట్‌ కైట్‌ ఎగురుతుందిలా..

Published Sun, Jan 14 2024 8:52 AM | Last Updated on Sun, Jan 14 2024 10:32 AM

Makar Sankranti Festival Begins From Today - Sakshi

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఎంవీఎం గ్రౌండ్‌లో ‘సంక్రాంతి మహోత్సవ్-2024’కు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం (జనవరి 14) రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. 

ఉత్సవంలో భాగంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒకరికొకరు పసుపు, కుంకుమ పూసుకుంటారు. తరువాత పతంగుల పోటీ జరగనుంది. ఈ సందర్భంగా  గుజరాత్‌కు చెందిన​ పతంగుల కళాకారులు ప్రత్యేకంగా తయారుచేసిన జాయింట్‌ గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. దాని పరిమాణం 25 అడుగుల వరకు ఉంటుంది. ఈ జాయింట్‌ పతంగులలో కార్టూన్లు, సింహాలు, వివిధ బొమ్మలు ఉంటాయి.

‘సంక్రాంతి మహోత్సవ్-2024’లో మహిళల ఆధ్వర్యంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటయ్యాయి. అలాగే జిల్లా స్థాయి పతంగుల ఎగురవేత పోటీ ఏర్పాటు చేశారు. సాయంత్రం లోహ్రీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భోగి మంటలు వేయడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాలిపటాలు ఎగురవేయాలనే ఉత్సాహం కలిగినవారికి నిపుణులు శిక్షణ అందిస్తారు. ‘సంక్రాంతి మహోత్సవ్-2024’ జనవరి 15న ముగుస్తుంది. 
ఇది కూడా చదవండి: తొలి గాలిపటాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు ఉపయోగించారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement