Maharashtra CM says, 'Even Bill Clinton Asked Who's Eknath Shinde' - Sakshi
Sakshi News home page

సీఎం షిండే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. బిల్‌ క్లింటనే తనపై ఫోకస్‌ చేశారంటూ..

Published Fri, Dec 23 2022 5:22 PM | Last Updated on Fri, Dec 23 2022 5:53 PM

Maharashtra CM Says Even Bill Clinton Asked Who Is Eknath Shinde - Sakshi

శివసేనలో తిరుగుబాటుతో మెజార్టీ ఎమ్మెల్యేలతో, బీజేపీతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్ధవ్‌ థాక్రేకు ఊహించని షాక్‌ తగిలింది. ఈ క్రమంలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 

కాగా, నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం ఏక్‌నాథ్‌ షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. నెల క్రితం​ ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అతను అమెరికాలో నివాసం ఉంటాడు. అతడు బిల్‌ క్లింటన్‌కు సన్నిహితుడు. అయితే, అతడి బంధువు ఒకరు.. ఆయన దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో బిల్‌ క్లింటన్‌ను కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంగా బిల్‌ క్లింటన్‌.. అతడిని నా గురించి అడిగారు. ఏక్‌నాథ్‌ షిండే ఎవరు?. అతడు ఏం చేస్తాడు?. ఎప్పుడు నిద్రపోతారు?. ఎప్పుడు తింటారు?. అని అడిగినట్టు చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. తానే ఏ రేంజ్‌లో ఉన్నాడో పరోక్షంగా చెప్పారు. 

అనంతరం, షిండే మాట్లాడుతూ.. కొంతమంది నా పని అయిపోందని అనుకుంటున్నారు. జర్నలిస్టు మిత్రులు కూడా నన్ను అడుగుతున్నారు. కానీ, అన్నీ చెప్పలేము కదా. నేనెప్పుడూ నటించలేదు. ప్రతీకారంతో ఎవరినీ దెబ్బకొట్టలేదు. నాకు అలాంటి మనస్తత్వం లేదు. భవిష్యత్త​్‌లో ఏం చేస్తామో అందరూ చూస్తారు అని అన్నారు. అంతకుముందు కూడా షిండే.. ప్రపంచంలోని 33 దేశాలు తన తిరుగుబాటును గమనించాయని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement