MP Election Results 2023: మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ గెలుపు | Madya Pradesh Assembly Election Results 2023 LIVE Updates | Sakshi
Sakshi News home page

MP Election Results 2023: మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ గెలుపు

Published Sun, Dec 3 2023 7:28 AM | Last Updated on Sun, Dec 3 2023 10:33 PM

Madya Pradesh Assembly Election Results 2023 LIVE Updates - Sakshi

Live Updates..

160 సీట్లలో బీజేపీ విజయం, మరో 3 చోట్ల ఆధిక్యం

63 చోట్ల కాంగ్రెస్‌ విజయం, 2 స్థానాల్లో ముందంజ

163 స్థానాల్లో బీజేపీ..

మధ్యప్రదేశ్‌లో 155 సీట్లలో బీజేపీ విజయం, మరో 12 చోట్ల ముందంజ

61 చోట్ల కాంగ్రెస్‌ విజయం, 5 స్థానాల్లో ముందంజ

ఒక సీటు గెలిచిన భారత్‌ ఆదివాసీ పార్టీ 

152 స్థానాల్లో బీజేపీ విజయం

మధ్యప్రదేశ్‌లో 152 సీట్లలో గెలుపొందిన బీజేపీ, మరో 12 చోట్ల ఆధిక్యం

56 చోట్ల కాంగ్రెస్‌ విజయం, 9 స్థానాల్లో ముందంజ

ఒక చోట భారత్‌ ఆదివాసీ పార్టీ గెలుపు

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన బీజేపీ 

  • 122 స్థానాలలో బీజేపీ విజయం. మరో 42 చోట్ల ఆధిక్యం
  • 36 చోట్ల కాంగ్రెస్‌ గెలుపు. 29 నియోజకవర్గాల్లో ముందంజ.

60 దాటిన బీజేపీ విజయాలు

  • ఇప్పటివరకూ 61 స్థానాల్లో బీజేపీ గెలుపు. 
  • 105 స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యం.
  • 15 చోట్ల కాంగ్రెస్‌ విజయం, 48 స్థానాల్లో ముందంజ.

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు బీజేపీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. 159 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది. 62 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. భారతీయ ఆదివాసీ పార్టీ ఒక స్థానంలో గెలుపొంది.

బీజేపీ తొలి విజయం
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం

నేపానగర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మంజు రాజేంద్ర దాదు 44,805 ఓట్ల మెజార్టీతో గెలుపు.

మంజు రాజేంద్ర దాదుకు మొత్తం 1,13,400 ఓట్లు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గెందూ బాయికి 68,595 ఓట్లు. 


► మధ్యప్రదేశ్‌లో భారీలో లీడింగ్‌లో ఉన్న బీజేపీ. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. కేంద్రమంత్రి ఆశ్విణి వైష్ణవ్‌, పార్టీ నేతలతో  సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 164 స్థానాల్లో ముందంజ.
కాంగ్రెస్‌ 63 స్థానాల్లో లీడింగ్‌
బీఎస్పీ 2 స్థానాల్లో లీడింగ్‌

మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌లో దూసుకుపోంది. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహన్‌తో కలిసి బీజేపీ నేతలు నరేంద్రసింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సిందియా ఇతర పార్టీ నేతలు.. సీఎం చౌహాన్‌ నివాసంలో కౌంటింగ్‌ తీరును పరిశీలిస్తున్నారు.

► మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ లీడింగ్‌
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. 
ఇప్పటివరకు బీజేపీ 158 స్థానాల్లో ముందంజ.
కాంగ్రెస్‌ 69 స్థానాల్లో లీడింగ్‌
బీఎస్పీ 2 స్థానంలో లీడింగ్‌

 బీజేపీకి భారీ విజయం లభిస్తుందని నమ్మకం: అశ్విని వైష్ణవ్‌
బీజేపీకి భారీ విజయం లభించిందని, దానిపై తాము నమ్మకంగా ఉన్నామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌ ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించారని పేర్కొన్నారు.

 ప్రేమతో బీజేపీకి గ్రాండ్ మెజారిటీ వస్తుంది: సీఎం శివరాజ్‌
మధ్యప్రదేశ్‌ మనసులో మోదీ.. మోదీ మనసులో మధ్యప్రదేశ్‌ ఉన్నట్లు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన ప్రజల హృదయాలను కదిలించారని, దాని ఫలితం ఇదేనని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి, మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన పథకాలు కూడా ప్రజల హృదయాలను హత్తుకున్నాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఒక కుటుంబంగా మారిందని, ప్రజలు తమపై ఉన్న ప్రేమతో బీజేపీకి గ్రాండ్ మెజారిటీ వస్తుందని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. అది ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

 మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.
ఇప్పటివరకు బీజేపీ 150 స్థానాల్లో ముందంజ.
కాంగ్రెస్‌ 64 స్థానాల్లో లీడింగ్‌
బీఎస్పీ 1 స్థానంలో లీడింగ్‌

► మధ్యప్రదేశ్‌ మనసులో మోదీ.. మోదీ మనసులో మధ్యప్రదేశ్‌: వీడి శర్మ
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి మోదీ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి చెందిన బూత్ స్థాయి కార్యకర్తల కృషితో ప్రతి బూత్‌లో 51% ఓటింగ్ తీర్మానాన్ని నెరవేరుస్తున్నందుకు తాను గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను చూసి ప్రజలు ప్రధాని మోదీని ఆశీర్వదించారని తెలిపారు.

► మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజ
మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌ కొనసాగుతోంది.
ఇప్పటివరకు బీజేపీ 148 స్థానాల్లో ముందంజ.
కాంగ్రెస్‌ 60 స్థానాల్లో లీడింగ్‌
బీఎస్పీ 1 స్థానంలో ముందంజ.

► ఇలాంటి విషాదం ఎప్పుడూ పునరావృతం కాకూడదు: సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి విషాదం ఎప్పుడూ పునరావృతం కావొద్దని సీఎం  సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి విషాదం పునరావృతం కావొద్దని, దానిని నిర్ధారించడానికి, అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొన్నారు. బాధితులకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన తెలిపారు. 

  బీజేపీ 125-150 సీట్లు గెలుస్తుంది: నరోత్తమ్ మిశ్రా
మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి, దతియా సెగ్మెంట్‌ బీజేపీ అభ్యర్థి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. బీజేపీ 125-150 సీట్లు గెలుస్తుందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనే కాదు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.

 మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌ 
మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు బీజేపీ 133 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్‌ 52 స్థానాల్లో లీడింగ్‌.

► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌ కొనసాతున్న క్రమంలో కేంద్రమంత్రి  జ్యోతిరాదిత్య సిందియా భోపాల్‌లోని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నివాసానికి చేరుకున్నారు.
ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్‌. కాంగ్రెస్‌ 28 స్థానాల్లో ముందంజ.

 మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం: ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌
మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ ఆధిక్యతతో మళ్లీ అధికారంలోకి వస్తుందని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని కేంద్రమంత్రి, నర్సింగపూర్‌ సెగ్మెంట్‌ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గతం కంటే ఈసారి మెరుగ్గా పనిచేస్తామని ముందే చెప్పినట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో వస్తున్న ట్రెండ్స్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.

► మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌

మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు బీజేపీ 73 స్థానాల్లో లీడింగ్‌. కాంగ్రెస్‌ 28 స్థానాల్లో ముందంజ.

►మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముందంజ
కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ కమల్‌ నాథన్‌ భోపాల్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశమై కౌంటింగ్‌ ట్రెండ్‌ను పరిశీలిస్తున్నారు.
►బీజేపీ 37 స్థానాల్లో లీడింగ్‌. 
► కాంగ్రెస్‌ 7 స్థానాల్లో ముందంజ. 

►మధ్యప్రదేశ్‌లో బీజేపీ లీడ్‌
మధ్యప్రదేశ్‌ కౌంటింగ్‌ కొనసాగుతోంది
ఇప్పటి వరకు బీజేపీ.. 13
కాంగ్రెస్‌.. 2

► పోస్టల్ బ్యాలెట్‌లో సాగర్‌ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గానూ ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. షాజాపూర్‌లో బీజేపీ 5,645 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4,392 ఓట్లు వచ్చాయి. శివపురిలో బీజేపీకి చెందిన దేవేంద్ర జైన్ 2,322 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దామోలోని జబేరా అసెంబ్లీ స్థానం నుంచి ధర్మేంద్ర సింగ్ 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో ధర్మేంద్ర సింగ్‌కు 4,272 ఓట్లు, ప్రతాప్ సింగ్‌కు 2,425 ఓట్లు, వినోద్ రాయ్‌కు 1,431 ఓట్లు వచ్చాయి. జైత్‌పూర్‌లోని షాదోల్‌ నుంచి కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. అలీరాజ్‌పూర్‌లో బీజేపీ 2,200 ఓట్ల ఆధిక్యంలో ఉంది. జోబాట్‌లో కాంగ్రెస్ 1,100 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఖర్గోన్‌లో బీజేపీ అభ్యర్థి బాలకృష్ణ పటీదార్‌ ఆధిక్యంలో ఉన్నారు. భగవాన్‌పురా కాంగ్రెస్‌కు చెందిన కేదార్ డాబర్ ముందంజలో ఉన్నారు. కస్రవాడలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సచిన్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. షాదోల్ జిల్లా జైసింగ్ నగర్‌లో బీజేపీ ముందంజలో ఉంది. సాంచిలోని రైసన్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. భోజ్‌పూర్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఉదయపురాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సిల్వానీలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది.

► జబల్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన నివాసంలో.. విజయం సాధించాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశారు.

► మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్స్‌లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఇక్కడ 216 సీట్ల ప్రారంభ ట్రెండ్‌ వచ్చింది. బీజేపీ 126 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

►  జబల్‌పూర్ జిల్లాలోని పటాన్ స్థానంలో బీజేపీ 2811 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నార్త్ సెంట్రల్ అసెంబ్లీలో బీజేపీ 3311 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బార్గీలోనూ బీజేపీ ముందంజలో ఉంది. చింద్వారాలో బీజేపీకి చెందిన మోనికా బట్టీ అమరవారా ముందంజలో ఉన్నారు. చౌరాయ్‌లో కాంగ్రెస్‌ ముందంజలో ఉండగా.. సౌసర్‌లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. చింద్వారాలో కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ముందంజలో ఉన్నారు. పాంధుర్ణంలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. బుర్హాన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి అర్చన చిట్నీస్ తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. ఖర్గోన్ జిల్లాలోని కస్రావాడ్ నుంచి బీజేపీ 821 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నర్సింగపూర్‌లో తొలి రౌండ్‌లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ ఒక బూత్‌లో 47 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

► తొలి ట్రెండ్‌లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ 208 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

► సెహోర్‌లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. సెహోర్ అసెంబ్లీలో బీజేపీ 163 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అష్టాలో కాంగ్రెస్ 341 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బుద్నీలో సీఎం శివరాజ్ ముందంజలో ఉన్నారు. ఇచ్ఛావర్‌లో తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది.

► గ్వాలియర్‌లోని దబ్రా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే వెనుకంజలో ఉన్నారు. గ్వాలియర్ రూరల్ స్థానంలో బీజేపీకి చెందిన భరత్ సింగ్ కుష్వాహ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సాహిబ్ సింగ్ గుర్జార్ ముందంజలో ఉన్నారు. గ్వాలియర్-ఈస్ట్ స్థానంలో బీజేపీకి చెందిన మాయా సింగ్ వెనుకంజలో ఉ‍న్నారు. కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ సతీష్ సికార్వార్ ముందంజలో ఉన్నారు. పన్నాలో పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ముందంజలో ఉంది. పొవాయ్ స్థానం నుంచి బీజేపీ ముందంజలో ఉంది. షాదోల్‌లోని బియోహరి స్థానం నుంచి బీజేపీ ముందంజలో ఉంది. బర్వానీలోని సెంద్వా స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

► మధ్యప్రదేశ్‌లో బీజేపీ సంచలనం సృష్టిస్తొంది. 137 సీట్ల ప్రారంభ ట్రెండ్ వచ్చింది. బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుణ జిల్లా రఘోఘర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జైవర్ధన్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా ప్రజానీకం తమ వెంటే ఉన్నారని మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. ఎన్ని సీట్లు వస్తాయనేది నేనేమి చెప్పాలేను. మేమైతే విజయంపై నమ్మకంగా ఉన్నామన్నారు.

► మధ్యప్రదేశ్‌లో 113 సీట్ల తొలి ట్రెండ్‌లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గ్వాలియర్‌లో పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తయింది. ఇక్కడ కాంగ్రెస్ 4 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

► మధ్యప్రదేశ్‌లో తొలుత 42 సీట్ల ట్రెండ్‌ వెలువడింది. బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దాతియాకు చెందిన నరోత్తమ్ మిశ్రా ప్రారంభ ట్రెండ్స్‌లో వెనుకంజలో ఉన్నారు. 

► మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్‌ మొదలైంది. ఈ ధోరణి కాంగ్రెస్‌కు అనుకూలంగా ​కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతోంది. ముందుగా మొరెనా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు తెరిచారు. రాష్ట్రంలోని వికలాంగులు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లో తొలి ట్రెండ్‌లోని 29 స్థానాల్లో బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

►కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. ముందు నుంచి నేను ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. ఎన్నికల్లో 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుంది. బీజేపీ గెలిచే అవకాశమే లేదు. 

►మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 

►కౌంటింగ్‌ వేళ కాంగ్రెస్‌ నేతల హంగామా..

►మధ్యప్రదేశ్‌లో విజయం తమదంటే తమదేనని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. 

►మధ్యప్రదేశ్‌లో 52 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ జరగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ 2,533 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గురువారం నాటి ఎగ్జిట్‌ పోల్స్‌లో మూడు బీజేపీకి ఘనవిజయం ఖాయమని పేర్కొన్నాయి.

►2018 మాదిరిగా రెండు పార్టీలూ విజయానికి దగ్గరగా వస్తాయని మరికొన్ని అంచనా వేశాయి. ఒకట్రెండు కాంగ్రెస్‌ విజయాన్ని సూచించాయి. భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలుపుకుని తీరుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ శనివారం ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు ఈసారి మార్పుకే ఓటేశారని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 సీట్లు సాధించగా బీజేపీ 109 స్థానాలతో సరిపెట్టుకుంది.

రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 230
మెజారిటీ మార్కు: 116

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement