దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి.. Kanpur Tutor Boyfriend Kill Boy | Sakshi
Sakshi News home page

దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..

Published Tue, Oct 31 2023 9:31 PM | Last Updated on Tue, Oct 31 2023 9:37 PM

Kanpur Tutor Boyfriend Kill Boy  - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్‌గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు.   

రచిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్‌కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. 

టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.  

ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement