పంటల బీమా..రైతుకు ధీమా Did You Know About Kshema Sukruthi Crop Insurance Policy | Sakshi
Sakshi News home page

పంటల బీమా..రైతుకు ధీమా

Published Mon, Jun 17 2024 9:34 PM

Did You Know About Kshema Sukruthi Crop Insurance Policy

మన దేశ జనాభాలో 47% మంది వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు, ఇది భారతదేశ జిడిపిలో దాదాపు 20%కు దోహదం చేస్తుంది. అయితే   బీమా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియక పోవటం వల్ల బీమా  పొందిన వారి సంఖ్య వ్యవసాయం మీద ఆధారపడిన వారి సంఖ్యకు తగ్గట్టుగా లేదు.. మరోవైపు వ్యవసాయం అనేది ఏ కాలంలో అయినా  అనిశ్చిత ఆర్థిక చర్యగానే ఉంటుంది. ఇది చాలా వరకూ  రైతు నియంత్రణకు అందనిదే, వ్యవసాయం అంటే...ఊహాతీత వాతావరణం, తెగుళ్లు, వ్యాధులపై ఆధారపడి ఉంటుంది. చాలా తక్కువ లేదా ఎక్కువ, తగినంత కానీ సమయానుకూలం కాకుండా.సంభవించే   వర్షం, ఎండ  లేదా చలి కూడా  పంటలను నాశనం చేస్తాయి. వీటన్నింటినీ తట్టుకుంటూనే తుఫానులు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, వడగండ్ల వానలు తదితర ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా రైతులు మనకు ఆహారం అందించటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.  

రానుంది ఖరీఫ్‌...కావాలి రిలీఫ్‌...
ఈ నేపధ్యంలో... మనం  ఖరీఫ్‌ సీజన్‌లోకి వెళుతున్న వేళ, రైతులు తమ జీవనోపాధిపై ప్రభావం చూపే అనిశ్చితి పరిస్థితులు  నుంచి తమను తాము రక్షించుకోవడం అత్యంత ముఖ్యం. తద్వారా వారు అప్పుల బారిన పడకుండా ఉండడం, పేదరికం లోకి జారిపోకుండా నిలవటం కూడా అత్యవసరమే. దీనికోసం  పంట బీమాను ఎంచుకోవడం అత్యంత ఉత్తమమైన ఆర్థికపరమైన ఎంపికలలో ఒకటిగా నిలుస్తుంది. అనుకోని ప్రమాదాల కారణంగా అనిశ్చితి వాతావరణం కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడం ద్వారా ఇది రైతులకు ఆర్థికంగా ఒక రక్షణ వలయాన్ని అందిస్తుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను  ప్రోత్సహిస్తూ  వారి ఆదాయాన్ని కూడా పంటల బీమా స్థిరీకరిస్తుంది.  

ప్రప్రధమ  పంట బీమా ఉత్పత్తి అయిన క్షేమ సుకృతి వంటి బీమా పధకాలు ఎకరానికి రూ. 499 నుండి ప్రారంభం అవుతున్నాయి. రైతులకు తగినంత శక్తిని తిరిగి అందించేలా  100కు పైగా ఎక్కువ పంటలను రక్షించే  పంట బీమా పథకాలు ఉన్నాయి.  రైతులు తమ పంటలకు ముందుగా నిర్ణయించిన తొమ్మిది ప్రమాదాల జాబితా నుంచి ఒక పెద్ద, ఒక చిన్న ప్రమాదాల కలయికతో బీమాను ఎంచుకోవచ్చు. వాతావరణం, ప్రాంతం, వారి పొలం  స్థానం, చారిత్రక నమూనా మొదలైన వాటి ఆధారంగా తమ  పంటను ఎక్కువగా ప్రభావితం చేసే పలు విపత్తుల నుంచి రైతులకు ఇవి భరోసా అందిస్తాయి.

రెండు రోజుల్లోనే...చెల్లింపులు...
తుఫాను, ఉప్పెన (హైడ్రోఫిలిక్‌ పంటలకు వర్తించదు), వరదలు, వడగళ్ల వాన వంటి విపత్తులు   భూకంపం, కొండచరియలు విరిగిపడడం, మెరుపుల కారణంగా మంటలు, జంతువుల దాడి (కోతి, కుందేలు, అడవి పంది, ఏనుగు)  విమానాల వల్ల కలిగే స్వల్ప నష్టాలు సైతం  కవర్‌ చేసే విధంగా బీమా అందుబాటులో ఉంటుంది.

రైతులు తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా మొత్తాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఒక రైతు క్షేమ యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా బీమాను కొనుగోలు చేయవచ్చు. పాలసీ వివరాలు దెబ్బతిన్న పంట ఫోటోలు లేదా వీడియోలను అప్‌లోడ్‌ చేయడం ద్వారా క్లెయిమ్స్‌ కూడా  యాప్‌ ద్వారా చేయవచ్చు . గత డిసెంబర్‌లో మైచాంగ్‌ తుఫాను వల్ల తన పంట నాశనమైందని, ఆంద్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక రైతు  క్లెయిమ్‌ చేసిన రెండు రోజులలోపు తన బీమా మొత్తం  స్వీకరించగలగడం పంటల బీమా ఇచ్చే భధ్రతకు నిదర్శనం.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement