ఛత్తీస్‌గఢ్‌లో పెరుగున్న కరోనా కేసులు Corona is Spreading Rapidly in Chhattisgarh | Sakshi
Sakshi News home page

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పెరుగున్న కరోనా కేసులు

Published Sun, Jan 7 2024 1:27 PM | Last Updated on Sun, Jan 7 2024 2:12 PM

Corona is Spreading Rapidly in Chhattisgarh - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 24 మందికి కరోనా సోకింది. దీంతో ఆరోగ్య శాఖ  అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా బాధితులు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు చెందిన వారని సమాచారం. 

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో గత 24 గంటల్లో  కొత్తగా 11 మందికి కరోనా సోకింది. దీంతో రాజధానిలో కరోనా బాధితుల సంఖ్య 51కి చేరింది. ఇక్కడ ఇప్పటికే 40 మంది కరోనా బాధితులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 51కి పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. 

రాష్ట్రంలోని పారిశ్రామిక నగరం రాయ్‌ఘర్ కరోనా కేసులలో రెండవ స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 131కి చేరింది. కాగా 31 మంది కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4182 శాంపిల్స్‌ను పరీక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement