ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు! | Ayurveda doctors can now perform surgeries | Sakshi
Sakshi News home page

ఇక వారు కూడా ఆపరేషన్లు చేయొచ్చు!

Published Sat, Nov 21 2020 5:10 PM | Last Updated on Sat, Nov 21 2020 7:08 PM

Ayurveda doctors can now perform surgeries - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఆయుర్వేద వైద్యానికి ఆదరణ  పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ  సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  భారతీయు ఆయుర్వేద  వైద్య విధానం ప్రోత్సాహానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా  ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు  ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య) 2016 నిబంధనలను సవరించింది. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (ఈఎన్‌టీ, హెడ్‌, డెంటల్‌ స్పెషలైజేషన్‌) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారికి ప్రత్యేక శిక్షణను ప్రవేశపెట్టింది. శిక్షణ అనంతరం ఈఎన్‌టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా అనుమతి లభిస్తుంది.

ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్‌ గ్రాఫ్టింగ్‌, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా  షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (చెవి, ముక్కు, గొంతు వ్యాధులు) విధానాలలో అధికారికంగా శిక్షణనిస్తుంది. తద్వారా వారు స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంటారు.

ఎంఎస్ (ఆయుర్వేద) శాల్య తంత్రం
డీబ్రిడ్‌ మెంట్‌ / ఫాసియోటోమీ / క్యూరెట్టేజ్
పెరియానల్ చీము, రొమ్ము గడ్డ, ఆక్సిలరీ చీము, సెల్యులైటిస్
అన్ని రకాల స్కిన్‌ గ్రాఫ్టింగ్‌, ఇయర్‌ లోబ్ రిపైర్‌
లింఫోపోమా, ఫైబ్రోమా, స్క్వాన్నోమా మొదలైన కణతుల తొలగింపు
గ్యాంగ్రేన్ ఎక్సిషన్ / విచ్ఛేదనం
తీవ్ర గాయాలనిర్వహణ, అన్ని రకాల సూటరింగ్, హేమోస్టాటిక్ లిగెచర్స్,  బిగుసుకుపోయిన కండరాల చికిత్స
లాపరోటమీ
హేమోరాయిడెక్టమీ, రబ్బర్ బ్యాండ్ లిగేషన్, స్క్లెరోథెరపీ, ఐఆర్‌పీ, రేడియో ఫ్రీక్వెన్సీ / లేజర్ అబ్లేషన్ మొదలైన వివిధ పద్ధతులు.
యానల్ డైలేటేషన్, స్పింక్టెరోటోమీ అనోప్లాస్టీ
ఫిస్టులెక్టమీ, ఫిస్టులోటోమీ, పైలోనిడల్ సైనస్ ఎక్సిషన్, వివిధ రెక్టోపెక్సీలు
యురేత్రల్ డైలేటేషన్, మీటోమి, సున్తీ
పుట్టుకతో వచ్చే హెర్నియోటమీ, హెర్నియోరాఫీ, హెర్నియోప్లాస్టీ
హైడ్రోసెల్ ఎవర్షన్, థొరాసిక్ గాయానికి ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్ మొదలైనవి ఉన్నాయి

కన్ను
కనుపాపలను సరిచేసే సర్జరీ, క్యూరెట్టేజ్ ట్యూమర్‌ తొలగింపు సర్జరీ
పాటరీజియం
ఐరిస్ ప్రోలాప్స్-ఎక్సిషన్ సర్జరీ
గ్లాకోమా-ట్రాబెక్యూలెక్టమీ
కంటికి గాయం: - కనుబొమ్మ, మూత, కండ్లకలక, స్క్లెరా  కార్నియా గాయాలకుమరమ్మత్తు శస్త్రచికిత్స
స్క్వింట్ సర్జరీ - ఎసోట్రోపియా, ఎక్సోట్రోపియా
డాక్రియోసిస్టిటిస్- డిసిటి / డాక్రియోసిస్టోరినోస్టోమీ [డిసిఆర్]
కంటిశుక్లం శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సతో కంటిశుక్లం వెలికితీత మొదలైనవి

ముక్కు: సెప్టోప్లాస్టీ,  పాలీపెక్టమీ, రినోప్లాస్టీ
చెవి :  లోబులోప్లాస్టీ. అక్యూట్ సపరేటివ్ ఓటిటిస్, మాస్టోయిడెక్టమీ
గొంతు వ్యాధులు : టాన్సిలెక్టమీతో పాటు ఇతర చికిత్సలు
దంత : వదులు  దంతాల  బిగింపు, రూట్ కెనాల్‌,ఇతర చికిత్స

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement