ముంపు ప్రాంతాలను సందర్శించిన అధికారులు - | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతాలను సందర్శించిన అధికారులు

Published Thu, Jun 20 2024 12:58 AM | Last Updated on Thu, Jun 20 2024 12:58 AM

ముంపు

మంగపేట: మండల కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాలను మండల స్పెషలాఫీసర్‌ తుల రవి ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం సందర్శించింది. వర్షాకాలంలో గోదావరి వరదలు, గౌరారం వాగు వరద ఉధృతి కారణంగా మండల కేంద్రంలో ప్రతిఏటా లోతట్టు ముంపు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 15న సాక్షిలో పొంచి ఉన్న ప్రళయం శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు ముంపు ప్రాంతాలైన పొదుమూరు, సినిమాహాల్‌ వీధి, మంగపేట, బోరునర్సాపురం మధ్య నూతనంగా నిర్మించిన లోలెవల్‌ బ్రిడ్జిని వారు పరిశీలించారు. గత ఏడాది గౌరారంవాగు వరదకు ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చి లోలెవల్‌ బ్రిడ్జి పిల్లర్లకు అడ్డుపడిన అవశేషాలు గుర్తించారు. వాటిని తొలగిస్తే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద దిగువ ప్రాంతానికి ప్రవహిస్తుందని లేని పక్షంలో వాగు వరద నీటితో పాటు గోదావరి బ్యాక్‌ వాటర్‌తో సినిమాహాల్‌ వీధిలోని 28ఇళ్లతో పాటు పొదుమూరులోని లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు సైతం మునిగే ప్రమాదం ఉందని గుర్తించారు. ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు రూ. లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అనంతరం ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకధికారులతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగా చర్యలు చేపట్టాలని, వరదల పట్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పెషలాఫీసర్‌ రవి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వీరస్వామి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్‌, ఆర్‌ఆండ్‌బీ డీఈ రఘువీర్‌, ఐబీ ఏఈ వలీమ్‌ మహ్మద్‌, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ముంపు ప్రాంతాలను సందర్శించిన అధికారులు
1/1

ముంపు ప్రాంతాలను సందర్శించిన అధికారులు

Advertisement
 
Advertisement
 
Advertisement