Narappa Movie To Re-Release In Theatres On December 13 For Venkatesh Birthday - Sakshi
Sakshi News home page

Victory Venkatesh: వెంకటేశ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప

Published Wed, Dec 7 2022 9:23 AM | Last Updated on Wed, Dec 7 2022 10:50 AM

Victory Venkatesh Narappa Movie Release in Theatres on December 13th - Sakshi

ప్రస్తుతం ఇండస్ట్రీలో రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రాలను మరోసారి ప్రక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. స్టార్ హీరోస్ పుట్టినరోజు సందర్భంగా వారికి సంబంధించిన సినిమాలను ఫ్యాన్స్‌ కోసం రి రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ స్టార్స్ పుట్టినరోజు సందర్భంగా వారి హిట్ సినిమాలను రి రిలీజ్ చేశారు మేకర్స్.

ఇప్పుడు తాజాగా విక్టరీ వెంకటేశ్‌ మూవీ కూడా థియేటర్లో సందడి చేయబోతోంది. ఆయన బర్త్‌డే సందర్భంగా దగ్గుబాటి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ అందించింది సురేశ్‌ ప్రొడక్షన్స్‌. అయితే ఇటీవల వెంకటేశ్‌ నటించిన నారప్ప సినిమాను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.  కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేశారు. స్టార్‌ హీరో అయిన వెంకటేశ్‌ మూవీ ఓటీటీలో రిలీజ్‌ కావడంతో ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదే ఈ సినిమాను బిగ్‌స్క్రీన్‌పై చూడలేకపోయామనే నిరాశలో ఉండిపోయారు అభిమానులు.

ఇప్పుడు వారి కోసం నారప్పు మూవీకి వెంకి బర్త్‌డే సందర్భంగా డిసెంబర్‌ 13న థియేటర్లోకి తీసుకువస్తున్నట్లు తాజాగా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. అయితే ఒక్క రోజు మాత్రమే నారప్ప మూవీ థియేటర్లో సందడి చేయనుంది. కాగా నారప్ప మూవీకి ఓటీటీలో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా యాక్షన్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన నారప్ప చిత్రంలో ప్రియమణి, కార్తీక్ ర‌త్నం, రాజీవ్ క‌న‌కాల, రావు రమేశ్‌, నాజర్‌, రాఖీ (నారప్ప చిన్న కుమారుడు)కీ రోల్స్ పోషించారు. నారప్ప చిత్రాన్ని కలైపులి యస్ థాను సమర్పణలో సురేశ్‌ ప్రొడక్షన్స్ – వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

చదవండి: 
హీరోయిన్‌ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్‌ ఘాటు రిప్లై
అలా నేను సినిమాల్లోకి వచ్చాను: అక్కినేని అమల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement