అఫీషియల్: మూడు వారాల్లోనే ఓటీటీకి సైంధవ్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ Venkatesh Saindhav Movie OTT Release On This Date | Sakshi
Sakshi News home page

Saindhav Movie OTT Release: ఓటీటీకి వెంకటేశ్ సైంధవ్.. స్ట్రీమింగ్ డేట్‌ వచ్చేసింది

Published Wed, Jan 31 2024 2:29 PM | Last Updated on Wed, Jan 31 2024 2:59 PM

Venkatesh Saindhav Movie Ott Release On This Date - Sakshi

ఈ ఏడాది సంక్రాంతి ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు సందడి చేశాయి. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మిగిలిన మూడు చిత్రాలకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలు నెల రోజుల తర్వాతే ఓటీటీ వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్ నటించిన సైంధవ్‌ చిత్రం రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌.

(ఇది చదవండి: సంక్రాంతి మూవీస్.. ఓటీటీల్లో రిలీజయ్యేది ఎప్పుడంటే?)

శైలేశ్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ ‍కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ‍అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ప్రకటించింది. జనవరి 13న థియేటర్లలో విడుదలైన వెంకటేశ్ 'సైంధవ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement