12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్ | Upasana Post On 12th Wedding Anniversary With Klin Kaara Latest Pic | Sakshi
Sakshi News home page

Upasana Klin Kaara: చాన్నాళ్ల తర్వాత కూతురితో చరణ్-ఉపాసన క్యూట్ ఫొటో

Published Sat, Jun 15 2024 9:12 PM

Upasana Post On 12th Wedding Anniversary With Klin Kaara Latest Pic

మెగా కోడలు ఉపాసన మరో క్యూట్ ఫొటోతో వచ్చేసింది. రామ్ చరణ్‌తో పెళ్లి జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతూ సింపుల్ అండ్ క్యూట్ పోస్ట్ పెట్టింది. అయితే థ్యాంక్స్ చెప్పడంతో పాటు కూతురు క్లీంకాక లేటెస్ట్ ఫొటోని కూడా ఇందులో జోడించింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)

2012లో రామ్ చరణ్, ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. తొలుత ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపించాయి. కానీ రానురాను మెగా ఫ్యామిలీలోనే చరణ్-ఉపాసన.. వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అయిపోయారు. వీళ్లకు గతేడాది జూన్‌లో కూతురు పుట్టింది. ఈ బుజ్జాయికి క్లీంకార అని పేరు పెట్టుకున్నారు.

పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయటపెట్టట్లేదు. ఇప్పుడు కూడా తను, చరణ్.. కూతురిని నడిపిస్తున్నట్లు వెనక నుంచి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. అంటే మెగా మనవరాలు బుడిబుడి అడుగులు వేసేస్తుందని ఈ పోస్ట్‌తో ఉపాసన చెప్పకనే చెప్పేసింది.

(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)

Advertisement
 
Advertisement
 
Advertisement