టామ్‌క్రూజ్‌ ‘మిష‌న్ ఇంపాజిబుల్ 7’ షూటింగ్ పూర్తి Tom Cruise Mission Impossible 7 Shooting Completed | Sakshi
Sakshi News home page

Mission Impossible 7: ట్రామ్‌క్రూజ్‌ ‘మిష‌న్ ఇంపాజిబుల్ 7’ షూటింగ్ పూర్తి, విడుద‌ల‌ అప్పుడే

Published Sun, Sep 12 2021 9:54 AM | Last Updated on Sun, Sep 12 2021 9:58 AM

Tom Cruise Mission Impossible 7 Shooting Completed - Sakshi

హాలీవుడ్‌ మూవీ సిరీస్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ (ఎమ్‌ఐ)కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంత కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ సినిమాల్లోని హీరో తన అసిస్టెంట్స్‌తో కలిసి చేసే సాహసాలు అబ్బురపరిచేలా ఉంటాయి. అందుకే సిరీస్‌లోని మరో సినిమా రిలీజ్‌ అవుతుందంటేనే ఎప్పుడెప్పుడా అభిమానులు ఎదురుచూస్తుంటారు. 

హాలీవుడ్‌ స్టార్‌ నటుడు టామ్‌క్రూజ్‌ హీరోగా నటిస్తున్నా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సిరీస్‌లో ఆరు సినిమాలు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సిరీస్‌లో వస్తున్నా తాజా చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’. క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహిస్తున్నాడు. క‌రోనా వ‌ల్ల ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వచ్చిన.. ఏడో పార్ట్‌ షూటింగ్‌ తాజాగా పూర్తి అయ్యింది.

ఈ విషయాన్ని మేకర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పార్ట్‌తోపాటు ఎమ్‌ఐ 8ని కూడా త్వరగా పూర్తి చేసి 2023లో విడుదల చేయాలని మూవీ టీం భావించింది. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఎమ్‌ఐ 7 చిత్రీకరణ, విడుదల ఆలస్యం, ఇతర కారణాల వల్ల ఆ మూవీ కూడా ఆలస్యం అవుతోంది.

కాగా ఇటీవల ‘ఎమ్‌ఐ 7’ షూటింగ్‌ ఇంగ్లండ్‌ బర్మింగ్‌హమ్‌లో జరిగింది. టామ్‌క్రూజ్‌ కాస్ట్‌లీ కారును మూవీ టీం బస చేసిన హోటల్‌లో బయట పార్క్‌ చేయగా ఎవరో దొంగిలించారు. పోలీసులకు సమాచారం అందించగా కారుకు ఉన్న ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా దగ్గరలోకి ఓ విలేజ్‌లో గుర్తించారు. కోట్ల విలువ చేసే కారు దొరికినా అందులోని లగేజీ, నగదు పోయినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement