ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు! Shyam Selvan Starrer Nimmakuru Master Movie Grand Launch | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడి మనవడు హీరోగా కొత్త సినిమా లాంచ్‌..

Published Sun, Jun 16 2024 9:11 PM

Shyam Selvan Starrer Nimmakuru Master Movie Grand Launch

ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా నటిస్తున్న చిత్రం నిమ్మకూరు మాస్టారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జె.ఎమ్. సినీ ఫ్యాక్టరీ పతాకంపై జె.ఎమ్.ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్నారు. అముదేశ్వర్ దర్శకుడు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందిస్తుండగా అన్ని పాటలకు జొన్నవిత్తుల లిరిక్స్‌ సమకూరుస్తున్నారు. 

ఈ సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్.. హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మాధవపెద్ది సురేష్ చంద్ర మాట్లాడుతూ.. తమ కుటుంబం నుంచి ఐదో తరం వాడైన తన మనవడు శ్యామ్ సెల్వన్ హీరోగా పరిచయం అవుతుండడం గర్వంగా ఉందన్నారు. ఒక గొప్ప ఉదాత్తమైన కథాంశంతో రూపొందుతున్న రూపొందుతున్న "నిమ్మకూరు మాస్టారు" జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.

ఈ చిత్రంలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉందని పేర్కొన్న జొన్నవిత్తుల... ఇందులో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయని, ముఖ్యంగా ఒక పాట చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. మాధవపెద్ది ఇప్పటివరకు చేసిన సినిమాలు, కూర్చిన పాటలు ఒకెత్తు... మనవడి పరిచయ చిత్రమైన "నిమ్మకూరు మాస్టారు" ఒకెత్తు కానుందని జొన్నవిత్తుల అన్నారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని, రాజమండ్రిలో ఒక షెడ్యూల్ చేస్తున్నామని దర్శకుడు అముదేశ్వర్‌ తెలిపారు.

చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Advertisement
 
Advertisement
 
Advertisement