వాళ్లకు లక్కీ నటుడిగా మారిపోయిన శివరాజ్‌ కుమార్‌? Shiva Rajkumar Turned Lucky Actor In Kollywood | Sakshi
Sakshi News home page

వాళ్లకు లక్కీ నటుడిగా మారిపోయిన శివరాజ్‌ కుమార్‌?

Published Mon, Oct 16 2023 6:42 AM | Last Updated on Mon, Oct 16 2023 8:28 AM

Shiva Rajkumar Turned Lucky Actor In Kollywood - Sakshi

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ వారసుడు అన్న విషయం తెలిసిందే. శివ రాజ్‌కుమార్‌ నటించిన చిత్రాలకు కన్నడ ప్రేక్షకులు జేజేలు పలుకుతారు. అంత ఫాలోయింగ్‌ ఉన్న కథానాయకుడు ఈయన. అలాంటిది ఎప్పుడు తమిళంలో ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించడానికి వెనుకాడటం లేదు. రజనీకాంత్‌తో ఇటీవల జైలర్‌ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. దీంతో జైలర్‌ చిత్రం తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ మంచి వసూళ్లు సాధించింది. దీనికి కారణం అక్కడ శివరాజ్‌ కుమార్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

ఏదేమైనా ఆయన ఇప్పుడు ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంలో కూడా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటుడు కమలహాసన్‌ కథానాయకుడిగా నటించే చిత్రంలోని శివరాజ్‌ కుమార్‌ నటించే అవకాశం ఉన్‌ట్లు ప్రచారం జరుగుతోంది. శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ఘోస్ట్‌ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదల కానుంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది.

ఈ కార్యక్రమంలో నటుడు కమలహాసన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా కమలహాసన్‌తో దిగిన ఫొటోను శివరాజ్‌ కుమార్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి కమలహాసన్‌ వీరాభిమానినైనా తాను ఆయనను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీంతో రజనీకాంత్‌, ధనుష్‌ తర్వాత కమలహాసన్‌ చిత్రంలో కూడా శివరాజ్‌ కుమార్‌ నటించబోతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement