ఓటీటీలో 'శర్మాజీ కి బేటీ'.. విడుదల తేదీ వచ్చేసింది | Sharmajee Ki Beti Streaming Now On This OTT | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'శర్మాజీ కి బేటీ'.. విడుదల తేదీ వచ్చేసింది

Published Mon, Jun 17 2024 2:12 PM

Sharmajee Ki Beti Streaming Now On This OTT

మంచి కామెడీ కంటెంట్‌ ఉన్న సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకు రానుంది. 'శర్మాజీ కి బేటీ' అని చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుందని ప్రముఖ ఓటీటీ సంస్థ తెలిపింది. తాహిరా కశ్యప్ ఖురానా దర్శకురాలిగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతుంది. ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి అని తెలిసిందే.  క్యాన్సర్‌పై పోరాడి  ఆ మహమ్మారిని జయించిన తాహిరా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందులో సయామి ఖేర్, దివ్య దత్తా, సాక్షి తన్వర్ ప్రధాన పాత్రలలో నటించారు.

గతేడాది జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రీమియర్ షో పడింది. ఆ సమయంలో చాలామంది ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. మంచి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. జూన్‌ 28 నుంచి  'శర్మాజీ కి బేటీ' స్ట్రీమింగ్‌  కానుందని అమెజాన్‌ సోషల్‌ మీడియాలో తెలిపింది.

తాహిరా దర్శకత్వం వహించిన ఈ చిత్రం  కామెడీతో పాటు నాటకీయతతో కూడుకొని ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన స్త్రీలు  పట్టణ జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. హిళలలు వ్యక్తిగత, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆ మహిళల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈ సినిమా చెబుతుంది.  తాహిరాకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ గతంలో ఆమె చాలా షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసింది. అవన్నీ మంచి గుర్తింపు పొందడంతో.. ఇప్పుడు  శర్మాజీ కీ బేటీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement