సడన్‌గా ఓటీటీకి ఫీల్ గుడ్ లవ్‌ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Sandalwood Film Ondu Sarala Prema Kathe Suddenly Released In OTT And Streaming On This Platform - Sakshi
Sakshi News home page

Ondu Sarala Prema Kathe In OTT: ఓటీటీకి వచ్చేసిన ప్రేమకథా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Wed, Mar 20 2024 5:58 PM | Last Updated on Wed, Mar 20 2024 6:51 PM

Sandalwood Film Ondu Sarala Prema Kathe Sudden Streaming On This OTT - Sakshi

ఓటీటీలు వచ్చాక కొత్త కొత్త సినిమాలు చూసేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను ఓటీటీలు అందిస్తున్నాయి. ఏ భాష సినిమా అయిన డబ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గతంలో కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి రెండు పార్టులుగా వచ్చి సక్సెస్ సాధించింది. ప్రేమకథగా వచ్చిన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి ఆదరణ దక్కించుకుంది

తాజాగా మరో కన్నడ ప్రేమకథ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఫీల్ గుడ్ లవ్‌ స్టోరీ కథగా తెరకెక్కించిన ఒండ్రు సరళ ప్రేమ కథె చిత్రం సడన్‌గా స్ట్రీమింగ్‌ అవుతోంది.  ఈ సినిమాలో వినయ్ రాజ్‍కుమార్, మల్లికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 8న రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది.

ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం  కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను తెలుగు డబ్బింగ్‍లో తీసుకోస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్వస్తిష్ట, రాజేశ్ నటరంగ, అరుణ్ బలరాజ్, సాధు కోకిల, కార్తిక్ మహేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రామ్ మూవీస్ పతాకంపై మైసూర్ రమేశ్ నిర్మించగా.. వీర్ సామ్రాట్ సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement