సినిమా ఫ్లాప్‌ అయితే పార్టీ చేసుకుంటా: రామ్‌ చరణ్‌ | 'I Have Thrown Parties When My Films Failed': Ram Charan | Sakshi
Sakshi News home page

సినిమా ఫ్లాప్‌ అయితే పార్టీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజయ్యాక వారం దాకా అడుగు బయటపెట్టలేదు!

Published Mon, Jun 17 2024 12:17 PM

Ram Charan: I Had Parties When My Films Failed

మెగాస్టార్‌ చిరంజీవి పేరు నిలబెట్టాల్సిన బాధ్యత రామ్‌చరణ్‌దే! కెరీర్‌ ప్రారంభంలో తడబడ్డప్పటికీ రానూరానూ నటనలో ఆరితేరాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో గ్లోబల్‌ స్టార్‌ అయ్యాడు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్‌కు.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా? అన్న ప్రశ్న ఎదురైంది. 

ఒత్తిడిగా ఫీలవను
ఇందుకు చరణ్‌ స్పందిస్తూ.. ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. నా కెరీర్‌ విషయానికే వస్తే సినిమా ఫలితాల గురించి మరీ అంత ఒత్తిడిగా ఫీలవను. చెప్పాలంటే ఏదైనా సినిమా బాగా ఆడలేదంటే రిలాక్స్‌ అయ్యేందుకు పార్టీ చేసుకుంటాను. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ అయినప్పుడు వారం రోజుల దాకా ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టలేదు. నా కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్‌ చేశాను. 

ప్రస్తుతం ఏం చేస్తున్నా..
సక్సెస్‌, ఫెయిల్యూర్‌ల గురించి అంతగా ఆలోచించను. ఇప్పుడు ఏం చేస్తున్నాననేదే నమ్ముతాను. రేపటి గురించి ఆందోళన చెందను' అని చెప్పుకొచ్చాడు. కాగా రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ చేంజర్‌ సినిమా చేస్తున్నాడు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తోంది. అలాగే బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్‌ నడుస్తోంది. దీని తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో మరో మూవీ చేయనున్నాడు.

చదవండి: బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్‌ చేసిన స్టార్‌..

హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో

Advertisement
 
Advertisement
 
Advertisement