సీక్వెల్‌ స్టార్ట్‌ Rakul Preet Singh Begins Shoot Of Ajay Devgn Starrer De De Pyaar De 2 | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ స్టార్ట్‌

Published Wed, Jun 5 2024 12:09 AM | Last Updated on Wed, Jun 5 2024 12:10 AM

Rakul Preet Singh Begins Shoot Of Ajay Devgn Starrer De De Pyaar De 2

కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఆనందంలో ఉన్నారు హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అజయ్‌ దేవగన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, టబు లీడ్‌ రోల్స్‌లో నటించిన హిందీ చిత్రం ‘దే దే ప్యార్‌ దే’. అకివ్‌ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ 2019లో విడుదలై, మంచి విజయం సాధించింది. దీంతో ‘దే దే ప్యార్‌ దే’ సీక్వెల్‌ ‘దే దే ప్యార్‌ దే 2’ను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని అజయ్‌ దేవగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఈ సీక్వెల్‌ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ప్రస్తుతం అజయ్‌ దేవగన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్వెల్‌కు అకివ్‌ అలీకి బదులుగా అన్షుల్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘నా ఫేవరెట్‌ సినిమా ‘దే దే ప్యార్‌ దే 2’ సెట్స్‌లో జాయిన్‌ అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు రకుల్‌. ఈ చిత్రంలో అనిల్‌ కపూర్, మాధవన్‌ కీలక పాత్రల్లో నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే తొలి భాగంలో నటించిన టబు సీక్వెల్‌లోనూ నటిస్తారా? ఆమె స్థానంలో మరో నటి ఎవరైనా జాయిన్‌ అవుతారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ  సినిమా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement