చిరకాల కోరిక నెరవేర్చుకున్న టాప్‌ సింగర్‌ Polo G Rapstar Song 1st Place In Billboard Hot 100 Songs List | Sakshi
Sakshi News home page

దుమ్ము 'ర్యాప్‌'తున్నాడు!

Published Fri, Apr 30 2021 8:11 AM | Last Updated on Fri, Apr 30 2021 8:11 AM

Polo G Rapstar Song 1st Place In Billboard Hot 100 Songs List - Sakshi

అమెరికన్‌ ర్యాపర్, సింగర్, సాంగ్‌రైటర్‌ పోలో జీ ‘ర్యాప్‌స్టార్‌’ సాంగ్‌ బిల్‌బోర్డ్‌ హాట్‌ 100 సాంగ్స్‌ చార్ట్‌లో నెంబర్‌వన్‌ ఘనతను సాధించింది. ఫైనర్‌ థింగ్స్‌(2018) సింగిల్‌తో వెలుగులోకి వచ్చాడు పోలో జీ. ఇది బిల్‌బోర్డ్‌లో ‘11’వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత వచ్చిన డై ఏ లెజెండ్‌ (2019) ‘6’వ స్థానంలో నిలిచింది. ఇక ‘ది గోట్‌’ రెండో స్థానంలో నిలిచింది.

ఈ సంవత్సరం ట్రాప్‌ జానర్‌లో వచ్చిన ‘ర్యాప్‌స్టార్‌’తో మొదటిస్థానంలో నిలిచి తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు పోలో జీ. ఈ నెల 9న కొలంబియా రికార్డ్స్‌ ద్వారా విడుదలైన ర్యాప్‌స్టార్‌ సాంగ్‌ ‘ప్రతిరోజూ ఒక యుద్ధమే’ అంటోంది. మన ఆలోచనల నుంచి అలవాట్ల వరకు ఎన్నో యుద్ధాలు అవి! ‘మోడ్రన్‌ మ్యూజిక్‌లో పోలో జీ స్ట్రాంగెస్ట్‌ స్టోరీ టెల్లర్‌’ అంటున్నారు సంగీతకారులు.

చదవండి: 'రాజా రవి వర్మ'..వాళ్లను ఊహించుకొని పెయింటింగ్స్‌ వేసేవారట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement