Oscars 2023: Everything Everywhere All At Once Movie Won 7 Awards - Sakshi
Sakshi News home page

Oscars 2023: "ఎవ్రీథింగ్‌"కు అవార్డుల పంట.. ఏకంగా 7ఆస్కార్‌లు సొంతం

Published Mon, Mar 13 2023 1:05 PM | Last Updated on Mon, Mar 13 2023 1:34 PM

Oscars 2023: Everything Everywhere All At Once Movie Won 7 Awards - Sakshi

95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఓ హాలీవుడ్‌ చిత్రం సత్తా చాటింది. 'ఎవ్రిథింగ్‌ ఎవ్రివేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌'(Everything Everywhere All At Once)అనే హాలీవుడ్‌ చిత్రం ఏకంగా ఏడు ఆస్కార్లను కైవసం చేసుకుంది. 11 విభాగాల్లో నామినేట్‌ అయిన ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డును సొంతం చేసుకుంది.  ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు వరించాయి.

 కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్‌ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ఏడు ఆస్కార్‌లను సొంతం చేసుకొని సత్తా చాటింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement