హైదరాబాద్‌లో తండేల్‌ Naga Chaitanya thandel shoot in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో తండేల్‌

Published Sat, Mar 23 2024 12:26 AM | Last Updated on Sat, Mar 23 2024 12:26 AM

Naga Chaitanya thandel shoot in hyderabad - Sakshi

నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత నాగచైతన్య, డైరెక్టర్‌ చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘తండేల్‌’. ‘లవ్‌ స్టోరీ’ వంటి హిట్‌ మూవీ తర్వాత నాగచైతన్యతో రెండోసారి ‘తండేల్‌’లో నటిస్తున్నారు సాయి పల్లవి. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా ఈ మూవీ తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా షూట్‌ డైరీస్‌ పేరుతో సెట్స్‌లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్‌ లవ్‌ స్టోరీ ‘తండేల్‌’. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. పాత్రలకు అనుగుణంగా నాగచైతన్య–సాయిపల్లవి డీ –గ్లామర్‌గా కనిపిస్తారు. నటీనటుల గెటప్, క్యాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చందు మొండేటి’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్‌దత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement